సంపూ అందిరివాడు

మరిన్ని వార్తలు

అవును సంపూ అందరివాడే. కామెడీ హీరోగా అన్ని వర్గాల మనసుల్ని దోచుకున్నాడు. అందం, అభినయం వీటితో సంబంధం లేకుండా ఓ ప్రత్యేకమైన యాక్టింగ్‌ స్టైల్‌తో బోలెడంత అభిమానం సంపాదించుకున్నాడు సంపూర్ణేష్‌బాబు. సంపూని అభిమానించని వారుండరంటే అతిశయోక్తి కాదు. చేసినవి రెండు చిత్రాలే అయినా కానీ అపారమైన అభిమానం సంపూ సొంతమయ్యింది. సంపూ నటించిన 'కొబ్బరి మట్ట' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో సంపూ కామెడీ డిఫరెంట్‌ శైలిలో ఉంటుందట. పలు చిత్రాల్లో సంపూ అతిధి పాత్రలతో కూడా ఆకట్టుకున్నారు. సంపూ తాజా చిత్రం 'వైరస్‌'. ఈ సినిమాతోనూ సంపూ నవ్వుల పువ్వులు పూయించనున్నాడు. ఆయన స్క్రీన్‌పై ఏంటి స్టేజ్‌పై ఏంటి ఎక్కడ కనిపించినా నవ్వులే నవ్వులు. అలాంటిది కష్టపడి డైలాగుల మీద డైలాగులు చెప్పేస్తుంటే ఇంకెలా ఉంటుంది. కడుపుబ్బా నవ్వుకోవడం మాత్రమే మన వంతవుతుంది. ఎస్‌. ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అన్నట్లు ఈ సినిమాలో విలన్‌ ఎవరో తెలుసా? వెన్నెల కిషోర్‌. మంచి టైమింగ్‌ ఉన్న కామెడీతో ఆకట్టుకునే వెన్నెల కిషోర్‌ ఈసారి విలన్‌గా కూడా మెప్పిస్తానంటున్నాడు. ఈ ఇద్దరి మధ్యా వచ్చే సంభాషణలు, సీన్స్‌ ఆధ్యంతం ఆడియన్స్‌ని నవ్వుల లోకంలోకి తీసుకెళతాయి. త్వరలోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS