ప్ర‌భాస్‌తో మ‌రోసారి చేస్తోందా?

మరిన్ని వార్తలు

ఈమ‌ధ్య త‌మ‌న్నాకి బాగా అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. దాంతో స్టార్ హీరోయిన్ల రేసు నుంచి ప‌క్క‌కివ‌చ్చేసింది. త‌మిళం, హిందీ జ‌నాలు కూడా త‌మ‌న్నాని ప‌ట్టించుకోవ‌డం మానేశారు. బాహుబ‌లి 2 చేశానన్న తృప్తి కూడా త‌మ‌న్నాకి మిగ‌ల్లేదు. ఎందుకంటే ఈ సినిమాలో త‌మ‌న్నా క‌నిపించింది కాసేపే.  అయితే త‌మ‌న్నాకు ఇప్పుడో గోల్డెన్ ఆఫ‌ర్ ల‌భించిన‌ట్టు టాక్‌. ప్ర‌భాస్ న‌టిస్తున్న సాహోలో క‌థానాయిక‌గా త‌మ‌న్నాని తీసుకొన్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే నిజ‌మైతే... త‌మ‌న్నాకి మ‌ళ్లీ గోల్డెన్ డేస్ మొద‌లైన‌ట్టే. సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవ‌లే టీజ‌ర్ విడుద‌లై... హ‌ల్ చ‌ల్ చేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS