ఈ ఏడాది 'ఎఫ్ 2'తో బిగ్గెస్ట్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా, తర్వాత 'సైరా'తో కెరీర్ బెస్ట్ హిట్ సొంతం చేసుకుంది. ఇటీవలే తమిళ హీరో విశాల్‌తో 'యాక్షన్' సినిమాలో నటించి, యాక్షన్ గాళ్ అనిపించుకుంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి మళ్లీ 'సరిలేరు నీకెవ్వరు..' అంటూ మహేష్ సరసన ఓ స్పెషల్ సాంగ్‌తో కొత్త సంవత్సరానికి బోణీ కొట్టబోతోంది. ఈ రోజు మిల్కీ బ్యూటీ తమన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా 'సరిలేరు..' టీమ్ తమన్నాకి స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు.
'సరిలేరు..' నుండి తమన్నా పోస్టర్ రిలీజ్ చేసి, ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారు. మిలిటరీ ప్యాంటు ధరించి, జోష్‌గా తమన్నా డాన్స్ చేస్తున్న ఈ స్టిల్‌కి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో తనకూ ఓ మంచి ఛాన్స్ ఇచ్చినందుకు 'సరిలేరు..' టీమ్‌కి తమన్నా థాంక్స్ చెప్పింది.ఈ సందర్భంగా, తమన్నాకి 'సరిలేరు..' టీమ్‌తో పాటు, మిగిలిన సెలబ్రిటీలు, ఫ్యాన్స్ నుండి బర్త్‌డే విషెస్ పోటెత్తాయి. ఆమెకు బెస్ట్ ఫ్రెండ్ అయిన కాజల్ అగర్వాల్, తమన్నాని స్పెషల్‌గా విష్ చేసింది.