మిల్కీబ్యూటీ అంటేనే గ్లామర్, గ్లామర్ అంటే మిల్కీ బ్యూటీ. కెరీర్ డల్ అయిపోయిందనుకున్న తరుణంలో కూడా 'ఎఫ్ 2'లో బికినీ వేసి, ఘాటు ఘాటుగా అందాలారబోసింది. తన కన్నా జూనియర్ అయిన మెహ్రీన్‌తో పోటీ పడి మరీ అందాలారబోసింది తమన్నా. ఇక, ఇప్పుడు కూడా తమన్నాకి గ్లామర్ పాత్రలు పోటెత్తుతున్నాయట. ప్రస్తుతం తమన్నా చేతిలో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులున్నాయి.
అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ కూడా తమన్నా ఫుల్ బిజీగా గడుపుతోంది. తమిళంలో విజయ్‌తో 'యాక్షన్' సినిమాలో నటిస్తోంది. తెలుగులో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం 'సైరా'లో నటించింది. ఇక ఇప్పుడు తాజాగా తమన్నా చేతిలో మరో కొత్త ప్రాజెక్ట్ వచ్చి చేరింది సంపత్ నంది రూపంలో. గతంలో ఈ డైరెక్టర్‌తో రెండు సినిమాల్లో నటించిన తమన్నా ఇప్పుడు మూడో సారి కలిసి పని చేయబోతోంది. గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా ఎంపికైంది. ఇదంతా బాగానే ఉంది కానీ, తమన్నా ఇకపై గ్లామర్ పాత్రల్లో నటించకూడదనే డెసిషన్ తీసుకుందంటూ, లేటెస్ట్‌గా వినిపిస్తున్న టాక్.
అంటే ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తుందట. ఇంతవరకూ చాలా కమర్షియల్ మూవీస్‌లో నటించి, మెప్పించింది తమన్నా. ఇక ఇప్పుడు ఛాలెంజింగ్ రోల్స్‌లో నటించాలనే తన కోరిక తీర్చుకునే టైమొచ్చిందంటోంది. ఆ దిశగా ఇక తన తదుపరి ప్రాజెక్టులుండాలని కోరుకుంటోందట. మరి మిల్కీ బ్యూటీ గ్లామర్‌కి గుడ్ బై చెప్పేస్తే, కుర్రకారు గుండెలు గుభేల్‌మనిపోవు. అయితే, ఇది నిజంగా తమన్నా తీసుకున్న సీరియస్ డెసిషనా.? లేక జస్ట్ గాసిప్‌నా.? అనేది తెలియాల్సి ఉంది.