త‌మ‌న్నాని వ‌ద‌ల్లేక పోతున్న ద‌ర్శ‌కుడు.

By Inkmantra - September 25, 2019 - 07:30 AM IST

మరిన్ని వార్తలు

ప్ర‌తీ ద‌ర్శ‌కుడికీ ఓ సెంటిమెంట్ ఉంటుంది. త్రివిక్ర‌మ్ లాంటివాళ్ల‌కు `అ` సెంటిమెంట్‌. పూరి లాంటివాళ్ల‌కు బీచ్‌లో కూర్చుని రాయ‌క‌పోతే క‌థ రాసిన‌ట్టే ఉండ‌దు. సంప‌త్‌నందికీ ఓ సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ పేరు త‌మ‌న్నా. ర‌చ్చ సినిమాలో త‌మ‌న్నాని క‌థానాయిక‌గా ఎంచుకున్నాడు సంప‌త్‌నంది. ఆ త‌ర‌వాత‌... బెంగాల్ టైగ‌ర్ లోనూ త‌న‌నే క‌థానాయిక చేశాడు.

 

ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారీ త‌మ‌న్నానే ఎంచుకున్నాడు. గోపీచంద్ క‌థానాయ‌కుడిగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో క‌థానాయిక‌గా త‌మ‌న్నాని ఎంపిక చేశారు. గోపీచంద్ - సంప‌త్‌నంది కాంబినేష‌న్‌లో రాబోతున్న రెండో సినిమా ఇది. స్క్రిప్టు వ‌ర్కులు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది. అక్టోబ‌రు 2న విడుద‌ల కానున్న `సైరా`లోనూ త‌మ‌న్నా ఓ కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS