తమన్నా లవ్ మేటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ నటుడు వినయ్ వర్మతో తమన్నా డేటింగ్ చేస్తుందన్న వార్త.... ఇప్పుడు చిత్ర సీమ అంతా చక్కర్లు కొడుతోంది. `భాగి 3`, `డార్లింగ్స్` తదితర చిత్రాలతో ఆకట్టుకొన్నాడు వినయ్. తెలుగులో నాని హీరోగా నటించిన `ఎంసీఏ`లో తను విలన్‌గా నటించాడు. తమన్నా, వినయ్ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. అఆంటిది ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? ఎలా కలిశారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. పోయి పోయి.. విలన్‌ని ప్రేమించడం ఏమిటి? అని మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు.
వీరిద్దరూ తరచూ పార్టీల్లో కలుసుకొంటూ వచ్చారని, కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒక్కటయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. డిసెంబరు 31 రాత్రి గోవాలో వీరిద్దరూ పార్టీ చేసుకొన్నారు. బీచ్ ఒడ్డున జరిగిన ఓ పార్టీలో ఇద్దరూ చట్టా పట్టాలేసుకొని తిరగడమే కాకుండా కౌగిలింతలు, ముద్దులతో.. రెచ్చిపోయారు. వాటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. అవే.. వీళ్ల ప్రేమ బంధాన్ని బయటపెట్టాయి. అయితే దీనిపై తమన్నా గానీ, వినయ్ వర్మగానీ ఇప్పటి వరకూ స్పందించలేదు.. మరి ఎప్పుడు పెదవి విప్పుతారో చూడాలి.