కృష్ణ సూప‌ర్ హిట్ గీతాల‌తో... త‌మ‌న్నా!

By Gowthami - October 21, 2019 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

పాత పాట‌ల‌కు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. వాటిని స‌రిగా వాడుకోవాలే గానీ, త‌ప్ప‌కుండా ఓ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్‌గా త‌యార‌వుతాయి. 'వాల్మీకి' (గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌)లో ఎల్లువొచ్చె గోదార‌మ్మా... పాట‌ని రీమిక్స్ చేస్తే ఎంత అప్లాజ్ వ‌చ్చిందో గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు `స‌రిలేరు నీకెవ్వ‌రు`లోనూ అలాంటి ప్ర‌య‌త్న‌మే జ‌ర‌గ‌బో్తోంద‌ని టాక్‌ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. త‌మ‌న్నా పై ఓ ప్ర‌త్యేక గీతాన్ని తెర‌కెక్కించ‌డానికి చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తోంది.

 

వెండి తెర‌పై ఆ పాట‌ని ఓ రంగుల హ‌రివిల్లులా తీర్చిదిద్ద‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది టీమ్‌. అందుకోసం సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన కొన్ని సినిమాల్లోని సూప‌ర్ హిట్ గీతాల్ని ఈసినిమా కోసం మెడ్లీలా చేయ‌నున్నార్ట‌. ఆ పాట‌ల ఎంపిక కూడా దాదాపుగా పూర్త‌యింద‌ని స‌మాచారం. కృష్ణ పాట‌ల్లో మ‌హేష్ క‌నిపిస్తే ఆ కిక్కే వేరు. అలాంటిది సూప‌ర్ హిట్ గీతాల‌న్నీ ఓ చోట చేరిస్తే.. ఆ పాట ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? పైగా త‌మ‌న్నా స్టెప్పులు ఈ పాట‌కు మ‌రిన్ని కొత్త హంగులు తీసుకొస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS