నిన్న తమిళనాట జరిగిన ఒక సంఘటన యావత్ చిత్రపరిశ్రమని షాక్ కి గురిచేసింది.
ఆ సంచలనం సృష్టించిన వార్త వివరాల్లోకి వెళితే, చెన్నైకి సమీపంలోని పనయూర్ ప్రాంతంలోని ఒక రిసార్ట్ లో కొందరు వ్యభిచారం చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఆ రిసార్ట్ పైన దాడి చేసి కొందరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఆ అరెస్ట్ కాబడిన వారిలో తమిళ చిత్రపరిశ్రమకి చెందిన సంగీత బాలన్ అనే ఓ ప్రముఖ నటి ఉన్నారు.
ఇక ఆమెనే ఈ వ్యభిచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తున్నది, ఈ మొత్తం బిజినెస్ లో సంగీత బాలన్ కి సహకరిస్తున్న సురేష్ అనే వ్యక్తిని ఆమెతో పాటుగా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిరువురికి మేజిస్ట్రేట్ పోలీసు కస్టడీ విధించారు.
ఇలాంటి సంఘటనల్లో చిత్రపరిశ్రమకి చెందిన వారు ఉంటుండడం వల్ల సినిమా పరిశ్రమకి చెడ్డ పేరు వస్తున్నది అన్న అభిప్రాయం నెలకొంది.