కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు, హీరో నిఖిల్ పెళ్లి చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న ఈ సమయంలో వివాహ వేడుక జరిగింది, బెంగళూరు సమీపంలోని రామనగరలో ఉన్న ఫాంహౌస్‌లో ఈరోజు నిఖిల్ వివాహం జరిగింది. కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి ఎమ్.కృష్ణప్ప మేనకోడలు రేవతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి బాలీవుడ్‌హీరోయిన్ రవీనా టాండన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న ఈ సమయంలో వివాహ వేడుక నిర్వహించడం ఏంటని ప్రశ్నించింది.
కరోనా సంక్షోభంలో పేదలు తమ కుటుంబ సభ్యులను చేరుకోలేకపోతున్నారని, ఆకలితో అలమటిస్తున్నారని , కానీ ధనికులు మాత్రం నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారని ఫైర్ అయ్యింది. రవీనా ఆగ్రహంలో లాజిక్ వుంది. మరి ఈ వివాహ తంతుపై ప్రభుత్వాలు, అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.