సక్సెస్‌ల మీద సక్సెస్‌లు వస్తోంటే తాప్సీలో కొత్త కోణం కూడా బయటపడ్తోంది. తెలుగు సినీ పరిశ్రమపై అసహనం వెల్లగక్కుతోంది ఈ బ్యూటీ. బాలీవుడ్‌లో మంచి కథా బలం ఉన్న సినిమాలొస్తుంటాయనీ, సౌత్‌లో కూడా అలాంటివి వచ్చినా వాటిల్లో హీరోకే ఎక్కువ ప్రాధాన్యమనీ, హీరోయిన్లని కేవలం గ్లామర్‌కి ప్రాధాన్యం ఉన్న పాత్రలో చూపిస్తారని చెప్పింది తాప్సీ. సౌత్‌లో తాప్సీ ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే. కాబట్టి తెలుగు సినిమాపైనే తాప్సీ ఇలా ఆరోపణలు చేస్తుందనుకోవచ్చు. అయితే చేసిన సినిమాల్లో కూడా తాప్సీ గొప్పగా నటించేయలేదు. ఈ విషయం తాప్సీ గుర్తుంచుకోవాలి. సింగిల్ ఎక్స్‌ప్రెషన్‌తో తెలుగు సినిమాల్లో నెట్టుకొచ్చేసింది తాప్సీ. తన మైనస్‌లను బాలీవుడ్‌లోకి వెళ్ళిన తర్వాత ఆమె కవర్ చేసుకుంది. తెలుగులో 'మల్లీశ్వరి', 'అల్లరిపిడుగు' లాంటి సినిమాల్లో నటించి నటిగా ఫెయిల్యూర్స్ చూసిన కత్రినా, బాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్ అయినప్పటికీ కూడా తెలుగు సినీ పరిశ్రమపై ఆరోపణలు చేయలేదు. అలాంటిది ఇన్ని తెలుగు సినిమాల్లో నటించి, గ్లామర్ డాళ్‌గా మంచి పేరు తెచ్చుకుంది. అంతేకానీ తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే దాని వెనుక చాలా కష్టం, తపన ఉండాలి. అలాంటి అవకాశం రావడానికే చాలా కాలం పడుతుంది. బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చేసుకుంది కదా అని ఇప్పుడు టాలీవుడ్‌పై నిందలు మోపడం తాప్సీకి తగదు. మరి తాప్సీ ఎందుకిలా చేస్తోందో?