లాక్ డౌన్‌కి ముందు... అంటే... ఎప్పుడో మార్చిలో విడుదల కావల్సిన సినిమా `ఉప్పెన`. కరోనా మహమ్మారి వల్ల.. విడుదల వాయిదా పడింది. థియేటర్లు తెరచుకున్నప్పటికీ.. ఉప్పెన రిలీజ్ డేట్ విషయంలో స్పష్టత లేదు. సంక్రాంతికి ఈ సినిమా వస్తుందని అందరి ఆశ. అయితే.. వేసవికి వాయిదా పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమాకి అన్ని రిపేర్లు జరుగుతున్నాయి. సినిమా అంతా అయిపోయాక కూడా... మార్పులూ చేర్పులూ అంటూ.. కాలం వెళ్లదీస్తున్నారు.
అయితే ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కరోనా కాలంలో... ఓటీటీ ఆఫర్లు ఈ సినిమాని ముంచెత్తాయి. 2.5 కోట్ల వరకూ బేరాలు సాగాయి. అయితే.. నిర్మాతలు మాత్రం కరగలేదు. అప్పట్లో ఈ సినిమాని ఓటీటీకి ఇచ్చేద్దాం అనుకున్నా, ఆ తరవాత... మనసు మార్చుకున్నారు. ఇప్పుడు ఎన్ని కోట్లిచ్చినా ఈ సినిమాని ఓటీటీకి అమ్మరట. థియేటర్లలోనే విడుదల చేస్తార్ట. ఎందుకంటే.. ఈ సినిమాకి ఇప్పటికి వరకూ 30 కోట్ల వరకూ అయిపోయిందని టాక్. థియేటర్ లో విడుదల చేస్తే కచ్చితంగా 50 కోట్లయినా వస్తుందని ఆశిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాపై నిర్మాతలకు అంత నమ్మకం ఉంది. ఏ ఓటీటీ సంస్థ కూడా 50 కోట్లకు ఈ సినిమా కొనదు. అందుకే.. ఈ సినిమాని కాస్త ఆలస్యమైనా థియేటర్లలోనే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.