మొదటి సినిమా 'అ' తోనే తన మార్క్ చాటుకున్నాడు ప్రశాంత్ వర్మ. అందరినీ అబ్బురరిచాడు. ఈ మధ్యే తేజ సజ్జా హీరోగా జాంబిరెడ్డి అంటూ ఓ జాంబీ జోనర్ ని పరిచయం చేశాడు. ఇప్పుడు మరో విభిన్నమైన కథ చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఐతే ఇది దర్శకుడిగా కాదు కేవలం ఆయన కథ మాత్రమే. తేజ సజ్జా హీరోగా, శివానీ హీరోయిన్‌గా ఓ సినిమా తెరకెక్కింది. ‘అద్భుతం’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.
ట్రైలర్ చాలా గమ్మత్తుగా వుంది ఒకే ఫోన్ నెంబర్ ఇద్దరికి ఉంటే ఏం జరుగుతుంది.? అనే పాయింట్ చుట్టూ నడిచే కథ ఇది. ట్రైలర్ లో వినోదంతో పాటు సస్పెన్స్ కూడా గ్రిప్పింగ్ గా చూపించారు. ఈ నెల 19న హాట్‌స్టార్ ఓటీటీ వేదికగా ఈ సినిమా విడుదల కానుంది. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం. లక్ష్మీ భూపాల ఈ చిత్రానికి సంభాషణలు అందించారు.