తేజ‌స్వి మ‌దివాడ 'క‌మిట్‌మెంట్' ఫ‌స్ట్ లుక్.

By iQlikMovies - July 03, 2020 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

కొద్ది రోజుల క్రితం 'క‌మిట్‌మెంట్‌' సినిమాలోని న‌లుగురు ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌ను ఇంట్ర‌డ్యూస్ చేస్తూ విడుద‌ల చేసిన స్పెష‌ల్ పోస్ట‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. న‌లుగురి క‌థ‌గా రూపొందుతోన్న ఈ ఎరోటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో తేజ‌స్వి మ‌దివాడ‌, ర‌మ్య ప‌సుపులేటి, సిమ‌ర్ సింగ్‌, అన్వేషి జైన్ మెయిన్ రోల్స్ పోషిస్తున్నారు. "ల‌వ్‌.. డ్రీమ్‌.. హోప్‌.. ఫైట్" అనేది ఈ మూవీ ట్యాగ్‌లైన్‌.

 

శుక్ర‌వారం (జూలై 3) తేజ‌స్వి మ‌దివాడ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా, 'క‌మిట్‌మెంట్‌'లో ఆమె ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో బికినీ ధ‌రించి బోల్డ్ అవ‌తార్‌లో తేజ‌స్వి ద‌ర్శ‌న‌మిస్తున్నారు. మునుప‌టి పోస్ట‌ర్ త‌ర‌హాలోనే ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సైతం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది.

 

'హైద‌రాబాద్ న‌వాబ్స్' ఫేమ్ ల‌క్ష్మీకాంత్ చెన్నా ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం అందిస్తోన్న ఈ చిత్రానికి న‌రేష్ కుమ‌ర‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. స‌జీష్ రాజేంద్ర‌న్‌, న‌రేష్ రాణా సినిమాటోగ్రాఫ‌ర్లుగా ప‌నిచేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS