ఆ ఇద్దరి మధ్యా ఏం నడుస్తోంది.!

మరిన్ని వార్తలు

బుల్లితెరపై ప్రసారమవుతున్న మెగా రియాల్టీ షో 'బిగ్‌బాస్‌'లో మసాలా ఐటెమ్స్‌ బాగానే చోటు చేసుకుంటున్నాయి. ఫైటింగ్స్‌, సెంటిమెంట్స్‌, టాస్క్‌ల్లో మజా అంతా బాగానే ఉంది. గత సీజన్‌తో పోల్చితే కంటెస్టెంట్స్‌ అంతా చాలా యాక్టివ్‌గా నీట్‌గా కనిపిస్తున్నారు. కాస్ట్యూమ్స్‌ విషయంలోనూ, మేకప్‌ విషయంలోనూ కూడా ఎట్రాక్టివ్‌గా కనిపిస్తున్నారు. దాంతో ఈ సీజన్‌ బిగ్‌బాస్‌ టోటల్‌గా కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. జెంట్స్‌కి జెంట్స్‌, లేడీస్‌కి లేడీస్‌ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా కనిపిస్తున్నారు. 

ఇకపోతే హౌస్‌లో చెప్పుకోదగ్గ అసలు సిసలు మసాలా అంశం తేజు, సామ్రాట్‌ మధ్య కెమిస్ట్రీ. వీరి కెమిస్ట్రీ చూస్తుంటే వీరిద్దరి మధ్యా ఏదో ఉందని అంతా అనుకుంటున్నారు. అనుకోవడమే కాదు, హౌస్‌ మేట్స్‌ సగం క్లారిటీ ఇచ్చేశారు. బిగ్‌బాస్‌ హోస్ట్‌ నాని కూడా ఈ విషయంపై ఆడియన్స్‌లో మరింత ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ అయ్యేలా చేస్తుండడం ఒకింత ఆ కెమిస్ట్రీకి బలం చేకూరుస్తుంది. 

లేటెస్టుగా ఈ విషయమై హౌస్‌లో టాపిక్‌ రైజ్‌ అయ్యింది. 'ఆల్రెడీ గత కొంత కాలంగా మా మధ్య స్నేహం ఉంది. తన బ్యాక్‌ గ్రౌండ్‌ విన్నాక నాకూ, నా బ్యాక్‌ గ్రౌండ్‌ విన్నాక తనకీ మధ్య ఉన్న ఆ స్నేహం మరింత ఎక్కువైంది. అంతే తప్ప, మా ఇద్దరి మధ్యా అంతకు మించి ఏమీ లేదనీ తేల్చేశారు తేజస్వి, సామ్రాట్‌లు.  

ఏం లేదని ఇద్దరూ చెబుతున్నా కానీ, వీరిద్దరి మధ్యా కెమిస్ట్రీ మాత్రం సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అనేంత రేంజ్‌లోనే కనిపిస్తోంది. అయితే ఇదంతా బిగ్‌బాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసమే చేస్తున్నారా? లేక నిజంగానే వీరిద్దరి మధ్యా ఏమైనా నడుస్తోందా? అనేది భవిష్యత్తులో క్లారిటీ వస్తుందేమో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS