తెలంగాణ అసెంబ్లీలో హీరో మహేష్ కి పనేంటి అని అనుకుంటున్నారా? అయితే ఒకాసారి క్రింద చదవండి-
మహేష్-కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న పొలిటికల్ సబ్జెక్టు చిత్రం- భరత్ అను నేను. ఈ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనపడనున్నాడు అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం తెలంగాణ అసెంబ్లీలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాలి అని యూనిట్ సభ్యులు నిర్ణయం తీసుకున్నారట.
ఈమేరకు ప్రయత్నించగా, అసెంబ్లీలో చిత్రీకరణ జరపటానికి అనుమతి లభించలేదు. దీనితో అసెంబ్లీని పోలిన విధంగా ఒక సెట్ వేసే పనిలో యూనిట్ ఉన్నట్టు తెలిసింది.
వీలైనంత త్వరగా సెట్ ని నిర్మించి అందులో షూటింగ్ మొదలుపెట్టాలని దర్శక-నిర్మాతలు నిశ్చయించారు.