GST అమలుతో దక్షినాది చిత్రపరిశ్రమల పై పన్నుల భారం పెరగనుండడంతో ఆయా ఇండస్ట్రీల ప్రతినిధులు ఆందోళన బాట పట్టారు.
ఇప్పటికే తమిళనాట ధియేటర్ల ను బంద్ చేసి తమ నిరసన తెలుపుతుండగా, అక్కడి సెలబ్రిటీలు సైతం తమ వాణి వినిపిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు పతాని రామకృష్ణ గౌడ్ తన కార్యవర్గంతో కలిసి GST బిల్లు పై రిలే నిరాహార దీక్షలతో నిరసన బాట పట్టారు.
ఈ GST బిల్లు వాళ్ళ 28% పన్నుతో తెలుగు చలన చిత్రపరిశ్రమ కనుమరుగయ్యే పరిస్థితి ఉందని ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర మరియు జాతీయ ప్రభుత్వాలు చొరవ తీసుకొని తమ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.