బిగ్‌బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో సీక్రెట్‌గా వీడియో రూపంలో బండారాలు బయట పెట్టాడు బిగ్‌బాస్. గార్డెన్ ఏరియాలోకి ఇంటి సభ్యుల్ని ఒక్కొక్కరిగా పిలిచి వీడియోలు ప్లే చేశాడు. కాంట్రవర్సీ వీడియోలవి. తన గురించి హౌస్ మేట్స్ ఏం మాట్లాడుకున్నారన్న విషయాల్లో బెస్ట్ కాంట్రవర్సీ విషయాల్ని ఎంచుకుని ఆ వీడియోలు ప్లే చేశాడు. మూడు వీడియోలు ప్లే చేసి, వారిలో ఎవరిపైన అయితే, రివేంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారో, వారి ముఖాన్ని కుండకు అతికించి, ఆ కుండను ఓ మనిషి బొమ్మకు పెట్టి, కర్రతో కసిగా కుండను బద్దలు కొట్టించాడు.
అలా హౌస్మేట్స్ బండారాలు బయటపడిపోయాయి. జింగిల్ టాస్క్‌లో భాగంగా, మహేష్‌కి నోటి దూల అంటూ రాహుల్ ఫన్నీగా పాడిన పాటకు వెనక నుండి 'ఓరేయ్ హౌలేగా నాక్కాదురా.. నీకేరా నోటి దూల' అంటూ సెటైర్ వేశాడు. ఆ సెటైర్‌కి కోపగించిన రాహుల్, మహేష్‌ని పిలిచి ఆ విషయంలో క్లారిటీ తీసుకున్నాడు. అయితే, అక్కడ నేనన్నది వేరే టోన్.. నీకు చూపించింది మరో టోన్.. అంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు.
కానీ, రాహుల్ కన్విన్స్ కాలేదు. కసి కసిగా కర్రతో మహేష్ ముఖం అతికించి ఉన్న కుండను బద్దలు కొట్టాడు. ఇలా హౌస్ మేట్స్‌లో అలీ రెండు సార్లు, శ్రీముఖికి రెండు సార్లు కుండ పగిలింది. ఈ సీరియస్ టాస్క్ అనంతరం బిగ్‌బాస్ బర్త్‌డే వేడుకల నిమిత్తం, హౌస్ మేట్స్ అందరికీ కేక్ పార్టీ ఇచ్చారు. ఒక్క కేక్ కాదు, ఉదయం నుండి, సాయంత్రం వరకూ కేకులతోనే కడుపు నింపుకోవాల్సి వచ్చింది పాపం హౌస్మేట్స్. ఈ దెబ్బతో కేక్ మీద మొహం మొత్తేసిందనీ, జీవితంలో ఇంక కేక్ జోలికి పోలేమని హౌస్మేట్స్ విస్తుపోయారు.