ప‌దిహేనేళ్ల త‌ర‌వాత రీమేక్ చేస్తున్నరా?

మరిన్ని వార్తలు

7 జీ బృందావ‌న కాల‌నీ గుర్తుంది క‌దా? అప్ప‌ట్లో కుర్ర‌కారుని కిర్రెక్కించిన సినిమా అది. సెల్వ‌రాఘ‌వ‌న్ క‌థ‌ని న‌డిపించిన విధానం, సంగీతం, న‌టీన‌టుల ప్ర‌తిభ‌... మ‌ర్చిపోలేని విజ‌యాన్ని అందించాయి. యువ‌న్ శంక‌ర్ రాజా అందించిన పాట‌లు ఇప్ప‌టికీ వినిపిస్తుంటాయి. ఈ సినిమా వ‌చ్చి దాదాపు 15 ఏళ్లు అయిపోయాయి. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. అదీ.. అల్లాట‌ప్పా ద‌ర్శ‌కుడు కాదు... సంజ‌య్ లీలా బ‌న్సాలీ.

 

టీ సీరీస్ సంస్థ ఈ సినిమా హ‌క్కుల్ని కొనుగోలు చేసింది. సంజ‌య్ ప్రస్తుతం హీరో, హీరోయిన్ల కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో నేరుగా విడుద‌లైన ఈ సినిమా, మిగిలిన భాష‌ల్లోనూ ఎప్పుడో రీమేక్ అయిపోయింది. ఇంత‌కాలానికి హిందీకి వెళ్తోంది. మ‌రి సంజ‌య్ లీలా బ‌న్సాలీ ఈ సినిమాని ఏ స్థాయిలో తీర్చిదిద్దుతారో చూడాలి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS