ప్రముఖ నటి భానుప్రియపై గురువారం సామర్లకోట పోలీస్ స్టేషనులో కేసు నమోదైందని వార్తలు వచ్చాయి. చెన్నైలోని భానుప్రియ ఇంటిలో తన కుమార్తెని నిర్బంధించి హింసిస్తున్నారని ప్రభావతి కేసు నమోదు చేసింది. ఆ వార్తని ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో చూసి షాక్ అయిన భానుప్రియ వెంటనే మీడియాని పిలిచి వివరణ ఇచ్చింది.
ఏడాది క్రితం సంధ్య అనే అమ్మాయిని తన ఇంటిలో పనికి పెట్టుకున్నామని, కానీ ఆ అమ్మాయి తన ఇంటిలోనే డబ్బు, నగలు, ఐపాడ్, కెమెరా, వాచ్ తదితర వస్తువులు దొంగిలించి, అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ చూసి వెళ్ళటానికి వచ్చినపుడు ఇంటికి చేరవేస్తూ ఉండేదని చెప్పారు. వారం క్రితం, ఈ విషయాన్ని తెలుసుకుని వాళ్ళ అమ్మని పిలిపించి నిలదీస్తే నిజాలు బయట పడ్డాయని పేర్కొన్నారు.
గట్టిగా వాళ్ళమ్మని నిలదీయడంతో ఐపాడ్, కెమెరా, రెండు వాచ్ లు తిరిగి తెచ్చిచ్చారు, కానీ డబ్బు, నగలు మాత్రం తిరిగివ్వలేదు. పోలీస్ కేసు పెడతామని బెదిరించడంతో డబ్బు, నగలు కూడా తీసుకొస్తానని వెళ్లి ప్రభావతి ఈ విధంగా మా పైనే అబద్ధపు కేసులు నమోదు చేసింది' అని భానుప్రియ తెలిపారు. ఇంట్లో పనిచేస్తున్న సంధ్య అనే పని అమ్మాయిని కూడా మీడియా ముందుకు తీసుకొచ్చి నిజం చెప్పించారు.
ఏది ఏమైనా ఒక మైనర్ బాలికను పనిలో పెట్టుకోవటం భానుప్రియ చేసిన తప్పుగానే చెప్పొచ్చు..