గ్లామ్‌షాట్‌: మనసుకు నచ్చిన గ్లామరే కానీ..!

By iQlikMovies - April 26, 2018 - 17:45 PM IST

మరిన్ని వార్తలు

క్యూట్‌ గ్లామర్‌తో 'మనసుకు నచ్చింది' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ అమైరా దస్తూర్‌. తొలి సినిమా అయినా ఈ సినిమాపై అమైరా భారీగా ఆశలు పెట్టుకుంది. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు సోదరి మంజుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రకృతి అందాలతో పోటీ పడేలా అమైరా దస్తూర్‌ అందంగా కనిపించింది.

 

అలాగే హాట్‌గానూ మురిపించింది. కానీ ఆశించిన రిజల్ట్‌ని అందించలేకపోయింది ఈ ముద్దుగుమ్మకి ఈ సినిమా. అందరికీ నచ్చుతాననుకుంది కానీ, ఎందుకో అమ్మడిని పక్కన పెట్టేశారు. ఈ జాకీచాన్‌తో నేషనల్‌ మూవీ అయిన 'కుంగ్‌ఫూ యోగా'లో నటించిన ఈ బ్యూటీ నిజంగానే యోగా బ్యూటీ.

 

ఎప్పటికప్పుడే యోగాసనాలు వేస్తూ ఫిజిక్‌ని తనకి నచ్చినట్లుగా మలిచేసుకుంటుంది. మంచి డాన్సర్‌. ఎక్స్‌ప్రెసివ్‌ ఫేస్‌. హాట్‌నెస్‌కీ అంతగా మొహమాటాలు లేవు మరి. అయినా కానీ అమ్మడికి అవకాశాలే రావడం లేదు. చూశారుగా, యోగాలో ఈ బ్యూటీ టాలెంట్‌. తన అందమైన శరీరాన్ని విల్లులా ఎలా వంచేసిందో. అదే అమైరా గ్లామర్‌కి ప్లస్‌ పాయింట్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS