ఈవారం మ‌రో ఆరు సినిమాలు

మరిన్ని వార్తలు

వారం వారం బాక్సాఫీసు కొత్త సినిమాల‌తో మోతెక్కిపోతోంది. 2020 లాక్ డౌన్‌తో థియేట‌ర్లకు తాళాలు ప‌డ్డాయి. అప్పుడు రిలీజ్ కావాల్సిన సినిమాలు సైతం ఇప్పుడు క్యూ క‌ట్టేస్తుండ‌డంతో, ప్ర‌తీవారం కొత్త సినిమాల హ‌వా ఉధృతంగా క‌నిపిస్తోంది. ఈవారం అయితే ఏకంగా ఆరు సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. `ఏ 1 ఎక్స్‌ప్రెస్‌`, `ప‌వ‌ర్ ప్లే`, `షాదీ ముబాక‌ర్‌`, `ఏ`,`ప్లేబ్యాక్‌` సినిమాలు ఈ వారం త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నాయి.

 

అయితే అంద‌రి దృష్టీ `ఏ1 ఎక్స్‌ప్రెస్‌`పైనే ఉంది. సందీప్ కిష‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. లావ‌ణ్య త్రిపాఠీ క‌థానాయిక‌. హాకీ నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. ప్ర‌చార చిత్రాలూ.. ఆక‌ట్టుకున్నాయి. అన్ని సినిమాల‌కంటే దీనికే ఎక్కువ ఓపెనింగ్స్ ఉండే అవ‌కాశం ఉంది. ఇక ఆ త‌ర‌వాత‌.. ఛాన్స్ `ప‌వ‌ర్ ప్లే`కే. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించిన సినిమా ఇది. ఇప్ప‌టి వ‌ర‌కూ ల‌వ్ స్టోరీలే ఎంచుకున్న రాజ్ త‌రుణ్‌.. ఈసారి డిఫరెంట్ గా ట్రై చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. టీవీ సీరియ‌ల్స్ తో స్టార్ గా మారిన సాగ‌ర్ ఇప్పుడు `షాదీ ముబార‌క్‌`తో హీరో అవ‌తారం ఎత్తాడు. ఆసినిమా ప్ర‌చార చిత్రాలూ బాగున్నాయి. ఏ, ప్లే బ్యాక్ సినిమాలు మంచి కాన్సెప్టుతో రూపొందిన క‌థలు. కాబ‌ట్టి... త‌ప్ప‌కుండా ఈ సినిమాల్నింటిపైనా ప్రేక్షకులు దృష్టి పెట్టొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS