కొన్ని కారణాల వల్ల నిన్న విడుదల కావల్సిన 'అయోగ్య' సినిమా ఈ రోజు విడుదలైంది. తెలుగులో ఎన్టీఆర్ నటించిన 'టెంపర్'కి తమిళ రీమేక్‌గా రూపొందింది ఈ సినిమా. విశాల్ చాలా ఇష్టపడి ఎంచుకున్న కాన్సెప్ట్ ఇది. సోషల్ కాజ్‌తో రేప్ కేసుకి ఉరిశిక్షే కరెక్ట్ శిక్ష అని తీర్పు చెప్పిన ఈ సినిమాలో హీరోగా తెలుగులో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూశాం. ఇప్పుడు విశాల్ నటవిశ్వరూపం చూస్తున్నాం. ఒకరోజు లేట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఈ సినిమా మంచి రివ్యూస్ అందుకుంది.
పోజిటివ్ రివ్యూస్‌తో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. తెలుగు 'టెంపర్'లో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తే, తమిళ టెంపర్ 'అయోగ్య'లో రాశీఖన్నా హీరోయిన్గా నటించింది. భారీ ఎత్తున ఈ సినిమాని ఈ రోజు ధియేటర్స్‌లోకి తీసుకొచ్చారు. వాస్తవానికి ఇదే సినిమాతో విడుదల కావల్సిన మరో నాలుగు చిన్న సినిమాల విడుదల విషయంలో అనుమానం ఇంకా నెలకొనే ఉంది. మరోవైపు ఈ మధ్య విశాల్‌కి అన్నింటా వివాదాలే తలెత్తుతున్నాయి. నిర్మాతల మండలి విషయంలో చెలరేగిన వివాదం కోర్టు మెట్లదాకా చేరింది. విశాల్‌కి అనుకూలంగా కోర్టు తీర్పు ఇస్తుందని నమ్మితే, అక్కడా చుక్కుదురయ్యింది.
నిర్మాతల మండలిలో ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్ని వివాదాల నడుమ విశాల్‌కి సంబంధించిన పెళ్లి ముచ్చట స్వీట్ న్యూస్‌గా ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది. హైద్రాబాదీ అమ్మాయి అనీషాతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విశాల్ త్వరలో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారనీ తెలుస్తోంది. అక్టోబర్ 9న విశాల్ అనీషాల పెళ్లి జరగనుందట.