తెనాలి రామకృష్ణ అనే పేరు వింటేనే మనకు కడుపుబ్బా నవ్వించే వ్యక్తి గుర్తొస్తాడు. నవ్వులే కాదండోయ్. తెనాలి రామకృష్ణ అంటే నిలువెత్తు తెలివితేటలకు నిదర్శనం కూడా. అయితే ఇప్పుడీ తెనాలి రామకృష్ణ తలంపు ఎందుకంటే, మన యంగ్ హీరో సందీప్ కిషన్ త్వరలో తెనాలి రామకృష్ణగా మనల్ని అలరించబోతున్నాడు. పక్కా వినోదాత్మకంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. కామెడీ ఎంటర్టైనింగ్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. కాగా ఈ నెల 7న సందీప్ కిషన్ బర్త్‌డే సందర్భంగా ఒక రోజు ముందుగా సినిమా ప్రీ లుక్ రిలీజ్ చేశారు.
ప్రీ లుక్ విషయానికి వస్తే, ఓ టేబుల్‌పై కాళ్లు పైన పెట్టుకుని దర్జాగా కూర్చొన్న వ్యక్తి, ఆ పక్కనే కొన్ని ఫైల్స్, ఓ పెద్ద బుక్, ఆ పైన టీ గ్లాసూ, కళ్లజోడూ.. ఇలా కొన్ని శాంపిల్స్ చూపించారు. టైటిల్లో 'బి.ఎ.బి.ఎల్' అనే క్యాప్షన్ ఉందండోయ్. దాన్ని బట్టి సినిమాలో మనోడేమైనా లాయరా.? అంటే ఏమో అవునేమో. అది తెలియాలంటే ఫస్ట్ లుక్ రావాల్సిందే. సినిమా అయితే ఫుల్ ఎంటర్టైనర్. ఇది పక్కా అట. మనోడికి జోడీగా ముద్దుగుమ్మ హన్సిక నటిస్తోంది. అన్నట్లు ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలండోయ్. వరలక్ష్మీ శరత్‌కుమార్. ఈ విలక్షణ నటి ఈ సినిమాలో విలన్‌గా నటిస్తోందట. ఇప్పటికే 'పందెం కోడి 2', 'సర్కార్' చిత్రాల ద్వారా వరలక్ష్మీ శరత్‌కుమార్ విలనిజం చూసేశాం. ఈ సినిమాలో ఇంకాస్త డిఫరెంట్ విలనిజం ప్రదర్శిస్తానంటోంది. అది చూడాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే అదీ సంగతి.