ఏపీలో చిత్ర పరిశ్రమకు చేయూతనివ్వండి : సీఎం జగన్ కు లేఖ!

మరిన్ని వార్తలు

చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, స్టూడియోలు, ల్యాబ్స్, అలాగే నిర్మాతలకు, ఆర్టిస్టులకు, ఇతర పరిశ్రమ వర్గాలకు హౌసింగ్ కొరకు అవసరమైన స్ధలాలను కేటాయించాలని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరింది. ఈ మేరకు మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్, కార్యదర్శులు టి.ప్రసన్నకుమార్, వడ్లపట్ల మోహన్ ముఖ్యమంత్రికి బుధవారం లేఖ రాశారు.

 

జీవో నెం.45 ద్వారా ఆంధ్రప్రదేశ్ లో షూటింగులు చేసుకోవడానికి ప్రభుత్వానికి చెందిన ప్రాంగణాలను ఉచితంగా అందిస్తున్నట్లు ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రికి వారు కృతజ్నతలు తెలియచేశారు. చెన్నై నుంచి చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వచ్చిన సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి స్టూడియోలు నిర్మించుకోవడానికి, ల్యాబ్స్ కట్టుకోవడానికి స్ధలాలు ఉదారంగా కేటాయించారని, అలాగే నిర్మాతలు, ఆర్టిస్టుల హౌసింగ్ కొరకు కూడా స్ధలాలు ఇచ్చారని వారు గుర్తు చేశారు. అదే విధంగా నేడు ఆంధ్రప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి పరిశ్రమ వర్గాలకు అవసరమైన స్ధలాలను కేటాయించాలని వారు ఈ లేఖలో కోరారు. ఇదే లేఖను ఏపీ టెలివిజన్ మరియు చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్ధ మేనేజింగ్ డైరెక్టర్ టి.విజయకుమార్ రెడ్డికి, ఛైర్మన్ విజయ చందర్ కు కూడా అందించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS