తెలుగులో వారసుడు ఫలితం ఎలా ఉన్నా తమిళ 'వారిసు' రిజల్ట్ పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నాడు విజయ్. అందుకే... దిల్ రాజు అండ్ టీమ్‌కి ఓ భారీ పార్టీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. ఒకట్రెండు రోజుల్లో విజయ్ హైదరాబాద్ వస్తున్నాడు. కేవలం పార్టీ ఇవ్వడం కోసం. ఇక్కడ ఓ హోటెల్ లో 'వారసుడు' టీమ్ ని పిలిచి భారీ విందు ఇవ్వబోతున్నాడు. నిజానికి... ఇదే టీమ్ ని విజయ్ చెన్నై పిలిపించి, పార్టీ ఇవ్వొచ్చు. కానీ.. కేవలం ఈ చిత్ర బృందంపై గౌరవంతో హైదరాబాద్ వస్తున్నాడు. విజయ్ దగ్గర ఓ మంచి అలవాటు ఉంది.
సినిమా అయిపోగానే అందరికీ పార్టీ ఇస్తాడు. హిట్ కొడితే.. మళ్లీ ఇంకో పార్టీ ఉంటుంది. వారసుడు సినిమా విషయంలోనూ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. 'వారసుడు' సినిమా ప్రమోషన్లకు విజయ్‌ని హైదరాబాద్ తీసుకుని రావాలని దిల్ రాజు చాలా ప్రయత్నించాడు. కానీ కుదర్లేదు. రూ.100 కోట్ల పారితోషికం ఇచ్చినా.. విజయ్ లాంటి స్టార్ ప్రమోషన్లకు రాకపోవడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అయితే... హిట్ కొట్టిన ఆనందంలో మాత్రం విజయ్ హైదరాబాద్ లో అడుగు పెడుతున్నాడు. ఆ రకంగా.. ఆలోటు తీర్చినట్టే.