తొలిసారి పవన్ కల్యాణ్ చిత్రానికి సంగీతం అందించే అవకాశం వచ్చింది తమన్‌కి. దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుందామని భావిస్తున్నాడు తమన్. వకీల్ సాబ్‌లోనుంచి తొలి పాట `మగువా మగువా` బయటకు వచ్చింది. ఆ పాటకు మంచి స్పందన వస్తోంది. అయితే మెలోడీ గీతం అది. ఈ సినిమాలో మరో మూడు గీతాలున్నాయి. మూడో మెలోడీలే. కాకపోతే ఇందులో ఓ మాస్ గీతానికి చోటివ్వాలని తమన్ భావిస్తున్నాడు. మాస్ గీతం లేకపోతే పవన్‌ఫ్యాన్స్ అసంతృప్తికి గురవుతారని, థియేటర్లో కిక్ రావాలంటే మాస్ పాట ఉండాలని పవన్ దర్శక నిర్మాతలకు సలహా ఇస్తున్నాడట.
అయితే వకీల్ సాబ్ లాంటి కథలో మాస్ గీతాలకు చోటు ఉండదు. పింక్‌లో హీరోయిజం అస్సలు కనిపించదు. అందులో పాటలూ లేవు. కానీ పవన్ కోసం కథలో కొన్ని మార్పులు చేశారు. హీరోయిజం బిల్డప్పులకూ చోటిచ్చారు. పనిలో పనిగా మాస్ పాట కూడా జోడిస్తే బాగుంటుందని తమన్ భావిస్తున్నాడట. దర్శక నిర్మాతలు ఓకే చెప్పినా, చెప్పకపోయినా తన వంతుగా ఓ మాస్ బాణీ వినిపించాలన్న ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తోంది. మరి దిల్ రాజు ఏమంటాడో చూడాలి.