ఎక్స్‌పోజింగ్‌ చేయనంటోన్న తెలుగమ్మాయ్‌.!

మరిన్ని వార్తలు

తెలుగమ్మాయిలు ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా ఉంటారు.. అనేది ఇప్పటి మాట కాదు. అందుకే బట్టల పొదుపు అస్సలు పాఠించని పొరుగు పాపలకే మన టాలీవుడ్‌లో ఎక్కువ డిమాండ్‌. అయితే, ఇప్పుడిప్పుడే మన తెలుగమ్మాయిలు కూడా కాస్త గ్లామరస్‌గా కనిపించేందుకు ఇష్టపడుతున్నారు. దాంతో ఇదివరకటితో పోల్చితే, కూసింత ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఎట్‌ లీస్ట్‌ సోదిలోనైనా ఉంటున్నారు. అయితే, తాజాగా మరో తెలుగమ్మాయి ఇండస్ట్రీకి పరిచయమవుతోంది. పేరు హర్షితా చౌదరి. 'తోలు బొమ్మలాట' అనే చిత్రం ద్వారా ఈ తెలుగు పోరి ఎంట్రీ ఇస్తోంది. రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ సినిమాని మాగంటి విశ్వనాధ్‌ తెరకెక్కిస్తున్నారు.

 

విశ్వంత్‌, వెన్నెల కిషోర్‌, పూజా రామచంద్రన్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే మన తెలుగమ్మాయ్‌ విషయానికి వస్తే, ఎక్స్‌పోజింగ్‌లో లిమిట్స్‌ ఉన్నాయి.. అని ముందే వివరణ ఇచ్చేసింది. ఇలాంటి వివరణలిస్తే, అవకాశాలు వస్తాయా.? అనేది మొదటి పాయింట్‌ అయితే, తను ఎంచుకునే కథలు, చక్కటి కుటుంబ కథా చిత్రాలై ఉండాలి అంటోంది. ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడదగ్గ సినిమాలై ఉండాలట. బాగానే ఉంది. కానీ, ఇలాంటి చిత్రాలకు ఆదరణ ఎప్పుడో కరువైపోయింది. అమ్మడి ఎంట్రీ ఓ దశాబ్ధ కాలం లేటైపోయింది.. అనే విషయం గ్రహించాలి మరి. ఇప్పుడంతా డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌, అందులోనూ బోల్డ్‌ కంటెంట్స్‌కే పట్టం కడుతున్నారుగా. అలాంటిది పాప పెట్టిన ఇన్ని షరతుల దృష్ట్యా ఇండస్ట్రీలో స్టాండ్‌ అవ్వడం కూసింత కష్టమైన పనే. అయినా, టైమ్‌ బాగుంటే చెప్పలేం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS