పుష్పరాజ్ తో బాలయ్య పోటీ

మరిన్ని వార్తలు

నందమూరి నటసింహం బాలకృష్ణ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు. ఒక వైపు వరుస సినిమాలు,  ఇంకో వైపు రాజకీయాలు, రియాల్టీ షోలతో అదరగొడుతున్నారు. ప్రస్తుతం బాబీతో ఒక మూవీ చేస్తున్నారు. మాములుగా అయితే ఈ సినిమా దసరా బరిలో నిలవాల్సింది. కానీ బాలయ్య పొలిటికల్ బిజీ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. దానితో ఈ సినిమాని సంక్రాతి బరిలో దించేలా ప్లాన్ చేశారు. కానీ ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున, రవితేజ సినిమాలు ఉండటంతో బాలయ్య మనసు మార్చుకున్నారని టాక్. 


ఒకేసారి ఇంతమంది స్టార్లు పోటీపడటం ఎందుకని, బాలయ్య కాస్త ముందే వస్తున్నారని సమాచారం. డిసెంబర్ లో ఈ మూవీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య అఖండ మూవీ కూడా డిసెంబర్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవటంతో అదే సెంటి మెంట్ తో డిసెంబర్ లో రిలీజ్ చేయటానికి రెడీ అయ్యారు బాబీ, బాలయ్య ద్వయం. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని ఫిలింనగర్ టాక్. 


ఈ మూవీ పై నందమూరి ఫాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. పేరు ఇంకా పెట్టలేదు కానీ షూటింగ్ 70% అయిపోయిందని తెలుస్తోంది. గ్లిమ్స్, టీజర్ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ బాలయ్య రాకపై నందమూరి ఫాన్స్ ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. కారణం అల్లు అర్జున్‌ పుష్ప 2 తో బాలయ్య పోటీకి దిగటమే. పుష్ప 2 డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే టైం లో బాలయ్య కూడా వస్తే పోటీ ఎలా ఉంటుందో అని సందేహంతో ఉన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS