The Ghost: 'ది ఘోస్ట్' సెన్సార్ రివ్యూ

మరిన్ని వార్తలు

అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ఘోస్ట్'. ఈ చిత్రం తాజా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ 'గాడ్ ఫాదర్' చిత్రానికి యూ/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా అద్భుతంగా వుందని, యాక్షన్ సన్నివేశాలు మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా పవర్ ఫుల్ గా వున్నాయని సెన్సార్ బోర్డ్ సభ్యులు చిత్ర యూనిట్ పై ప్రశంసలు జల్లు కురిపించారు.

 

ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ రేపు (సెప్టెంబర్ 25) కర్నూలులోని ఎస్టీబిసి గ్రౌండ్‌లో గ్రాండ్ గా జరగనుంది. నాగ చైతన్య, అఖిల్ ఈ గ్రాండ్ ఈవెంట్ కి హాజరుకానున్నారు. చాలా కాలం తర్వాత స్టార్ తండ్రీ కొడుకులు కలిసి సినిమా వేడుకకి రావడం అక్కినేని అభిమానులకు కన్నుల పండుగ కానుంది. పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS