సినీ అభిమానులకు ఇది శుభవార్త. జులై 1 నుంచి తెలంగాణలో థియేటర్లు పూర్తిగా తెరచుకోబోతున్నాయి. ఏపీలోనూ ఇదే పరిస్థితి కనిపించవచ్చు. ఇప్పటికే ఏపీలో కొన్ని చోట్ల థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అయితే జులై 1 నుంచి పూర్తి స్థాయిలో థియేటర్లు ఓపెన్ అవ్వబోతున్నాయి. ఇందుకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ త్వరలోనే ఓ ప్రకటన చేయొచ్చు. అయితే... ఆక్యుపెన్సీని 50 శాతానికే పరిమితం చేసే అవకాశం ఉంది. జులై అంతా ఇదే పరిస్థితి కొనసాగొచ్చు. ఆగస్టు నుంచి 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం ఇవ్వొచ్చు.
త్వరలోనే లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేస్తారన్న సమాచారం అందుతుండడంతో.. థియేటర్ల రీ ఓపెన్‌కు మార్గం సుగమం అవ్వబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే చాలా సినిమాలు విడుదల అవ్వక.. పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు గంపగుత్తగా విడుదల కాబోతున్నాయి. అయితే ముందుగా చిన్న సినిమాలే రాబోతున్నాయి. 100 శాతం ఆక్యుపెన్సీ ఇచ్చిన తరవాత మాత్రమే పెద్ద సినిమాలు వస్తాయి. మొత్తానికి.. థియేటర్ల దగ్గర ఇది వరకటి శోభ మాత్రం కనిపించబోతోంది. అంతకంటే ఆనందం ఏముంది?