అందుతున్న సమాచారం ప్రకారం, నాలుగు రోజుల నుండి GST బిల్లు మరియు రాష్ట్ర ప్రభుత్వపు 30% పన్నుల నేపధ్యంలో తమిళనాట ధియేటర్ల బంద్ కొనసాగుతున్నది.
అయితే వారు చేస్తున్న సమ్మెని నేటితో విరమిస్తున్నట్టు థియేటర్ యజమానుల సంఘం తెలియచేసింది. వారికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఈ సమస్య పై ఓ కమిటీ ని వేయన్నున్నట్టు, ఆ సదరు కమిటీ ప్రస్తుతం ఉన్న పన్నుల విధానం పై చర్చలు జరిపి ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది.