రేటు పెంచాలంటోన్న యంగ్‌ హీరో!

మరిన్ని వార్తలు

ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే నటుడు శ్రీ విష్ణు. విలక్షణ కథ అంటే ముందుగా గుర్తొచ్చే హీరో శ్రీ విష్ణు. ప్రస్తుతం ఆయన 'తిప్పరా మీసం' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. 'చీకట్లో చితక్కొట్టుడు' ఫేమ్‌ నిక్కీ తంబోలీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా మొదట్నుంచీ ఆసక్తి పెంచుతోంది. లేటెస్ట్‌గా విడుదలైన ట్రైలర్‌ క్యూరియాసిటీ డబుల్‌ చేసింది. ఈ సినిమాకి శ్రీ విష్ణు హీరోనా? విలనా? అనే అనుమానం కలిగించేలా ఉంది ట్రైలర్‌.

 

'నా గతాన్నీ, నా సమస్యని గుర్తించలేని ఈ సమాజం నేను తప్పు అని ముద్ర వేసింది..' అంటూ ఆవేశంగా తన గురించి ఏదో చెప్పడానికి ట్రై చేశాడు శ్రీవిష్ణు. ఎవ్వడెలా అనుకుంటే నాకేంటీ.? అంటూ ఇంకో పవర్‌ ఫుల్‌ డైలాగ్‌ చెప్పాడు. 'వాడికున్న కోపమల్లా వాడి అమ్మ మీదే..' అంటూ బ్యాక్‌ గ్రౌండ్‌లో వేరే వాళ్ల చేత చెప్పించిన డైలాగ్‌ వింటుంటే, ఏదో భయంకరమైన ఫ్లాష్‌ బ్యాక్‌ ఉందని అర్ధమవుతోంది. డైలాగులు, విజువల్స్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌.. ఇలా అన్నీ చాలా ఇంటెన్సివ్‌గా చూపించారు.

ట్రైలర్‌ని ఆధ్యంతం ఆకట్టుకునేలా, ఆసక్తి కలిగించేలా ఉంది. సినిమా రిలీజ్‌ అయ్యే వరకూ ఈ ఆసక్తి ఇలాగే ఉంచుకోండి. ఇదిలా ఉంటే, మనోడి చేతిలో మరో రెండు, మూడు ప్రెస్టీజియస్‌ ప్రాజెక్టులు కూడా ఉన్నాయట. 'తిప్పరా మీసం' రిజల్ట్‌ని బట్టి వాటి సంగతి చెబుతాడట. అయితే, అప్పటికి ఆయన రెమ్యునరేషన్‌ కూడా ఒకింత పెంచాలనుకుంటున్నానని తన మనసులో మాట చెప్పకనే చెప్పాడు. అంటే, ఇకపై ఈ విలక్షణ నటుడికి రేటు కాస్త ఎక్కువ ఆఫర్‌ చేయాల్సిందేనండోయ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS