వరుణ్ తేజ్ - రాశి ఖన్నా జంటగా నటించిన తొలిప్రేమ చిత్రం కలెక్షన్స్ రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఇక నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా మరోసారి ఈ చిత్రానికి కలెక్షన్స్ విపరీతంగా వచ్చాయి.
అయితే ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లో రూ 26 కోట్లు (గ్రాస్) అలాగే రూ 15 కోట్లు (షేర్) వసూలు చేసింది. ఇక నిన్న కూడా ఈ చిత్రానికి అన్ని చోట్ల కూడా హౌస్ ఫుల్స్ అని ట్రేడ్ వర్గాలు దృవీకరించాయి. ఇక నిన్నటితో కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ 12.45 కోట్ల (షేర్) కలెక్ట్ చేసింది.
అలాగే ఈ చిత్రానికి సంబంధించి వరుణ్ తేజ్ & కో నిన్న సక్సెస్ టీం ఏర్పాటు చేయగా ఆ సందర్భంగా మాట్లాడుతూ- ఈ సినిమా తీసిన దర్శకుడికి ఇది తొలిచిత్రం అని తెలిసి చిరంజీవి గారు షాక్ అయ్యారు అని తెలిపాడు. ఇక అన్ని చోట్ల నుండి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుండడంతో అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
మొత్తానికి తొలిప్రేమ చిత్రం అందరికీ ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది.