స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే బన్నీ అంటే ఆడాళ్లే కాదండోయ్, మగాళ్లనీ ఇంప్రెస్ చేసేస్తున్నాడు.
బాలీవుడ్‌లో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తాజాగా బన్నీపై తనకున్న అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు. టాలీవుడ్ హీరోల్లో బన్నీ అంటే తనకెంతో ఇష్టమనీ, టాలీవుడ్‌లో బన్నీతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని టైగర్ ష్రాఫ్ చెప్పాడు. సీనియర్ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడే ఈ టైగర్ ష్రాఫ్. 'హీరోపంతి' సినిమాతో బాలీవుడ్‌లో హీరోగా పరిచయమయ్యాడు. విశేషమేంటంటే బన్నీ హీరోగా తెరకెక్కిన 'పరుగు' చిత్రానికి రీమేకే ఈ 'హీరోపంతి'.
ఆ తర్వాత 'మున్నామైఖేల్', 'బాఘీ', బాఘీ 2' తదితర చిత్రాలతో పాపులర్ అయ్యాడు. డాన్సులు, ఫైట్లు ఇరగదీసేస్తుంటాడు మనోడు. తాజాగా టాలీవుడ్‌లో నటించాలనుందన్న తన మనసులోని కోరిక బయటపెట్టాడీ యంగ్ హీరో. అయితే జాకీ ష్రాఫ్ తెలుగులో పలు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించారు.
కానీ టైగర్ మాత్రం హీరో. మన హీరోగారి కోరిక మేరకు, ఒకవేళ మన దర్శక, నిర్మాతలు తెలుగులో అల్లు అర్జున్, టైగర్ ష్రాఫ్‌లను పెట్టి ఓ భారీ మల్టీ స్టారరేమైనా ప్లాన్ చేసేస్తారేమో చూడాలిక. అదే జరిగితే అదో సెన్సేషనల్ కాంబినేషనే అవుతుంది మరి.