టైటానిక్‌ లవ్‌స్టోరీ మళ్లీ షురూ కానుంది.!

By iQlikMovies - October 25, 2018 - 17:20 PM IST

మరిన్ని వార్తలు

'టైటానిక్‌' అనే పేరు తెలియని వాళ్లుండరు. చిన్నా, పెద్దా, క్లాస్‌, మాస్‌ అనే తేడా లేకుండా అందరికీ ఈ పేరు సుపరిచితమే. క్యూట్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన హాలీవుడ్‌ చిత్రం 'టైటానిక్‌'. రొమాంటిక్‌ ప్రియులు ఈ సినిమాకి ఎంత పెద్ద ఫ్యాన్సో చెప్పలేం. ఎన్ని రొమాంటిక్‌ చిత్రాలు సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేసినా, ఇప్పటికీ ఆ టైటానిక్‌ సినిమాని ఆదరించేవాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. 

అలాంటి 'టైటానిక్‌' సినిమాకి ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్‌ రాబోతోందంటే అభిమానులు పండగ చేసుకునే వార్తే. హాలీవుడ్‌ మూవీ అయినప్పటికీ, భాషతో సంబంధం లేకుండా ప్రపంచం మొత్తం ఆదరణ దక్కించుకుంది ఈ సినిమా. రికార్డు స్థాయిలో ఆస్కార్‌ అవార్డులు సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లు లియోనార్డో డికాప్రియో, కేట్‌ విన్స్‌లెట్‌ల పేర్లు పలికే సాహసం అందరూ చేయలేకపోయినా, వారి ముఖారవిందాల్ని మాత్రం తమ మనసులో పదిలంగా దాచేసుకున్నారు. జేమ్స్‌ క్యామరూన్‌ దర్శకత్వంలో వచ్చిన అద్భుత దృశ్యకావ్యమిది.

 

అయితే ఇప్పుడెందుకు ఈ టైటానిక్‌ని గుర్తు చేసుకోవాల్సి వస్తోందంటే, త్వరలో 'టైటానిక్‌' సీక్వెల్‌ రాబోతోందట. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ బిజినెస్‌మేన్‌ క్లైవ్‌ పామర్‌ ఈ సినిమాకి సీక్వెల్‌ రూపొందించే సన్నాహాల్లో ఉన్నారట. అప్పటి 'టైటానిక్‌'కి ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమాని రూపొందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. అప్పటితో పోల్చితే, ఇప్పుడు టెక్నాలజీలో చాలా చాలా అభివృద్ధి చూస్తున్నాం. సినీ రంగంలో ఆ టెక్నికల్‌ మార్పుల్ని ఆల్రెడీ ఆకళింపు చేసేసుకున్నాం. 

అలాంటి ఈ తరుణంలో 'టైటానిక్‌ 2' కోసం ఎలాంటి టెక్నికల్‌ వేల్యూస్‌ని ఉపయోగించనున్నారో.? ఎలాంటి విజువల్‌ వండర్‌గా ఈ సీక్వెల్‌ రూపొందనుందో తెలియాలంటే ఇంకొంత టైం వెయిట్‌ చేయాల్సి ఉంటుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS