బాలయ్య-పూరి కాంబినేషన్ లో రూపొందనున్న బాలయ్య 101వ చిత్రానికి ఒక ఆసక్తికర టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం.
వివరాల్లోకి వెళితే, టపోరి అనే వెరైటీ టైటిల్ ని పూరి సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ టైటిల్ ని బాలయ్య ఓకే చేస్తాడా లేక వేరే ఏదైనా టైటిల్ కి ఓకే చెప్తాడా అనేది తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే.
అయితే ఈ టైటిల్ కొత్తది కాదని, ఇంతకముందు కూడా ఈ టైటిల్ ని పోకిరి సినిమాకి సీక్వెల్ కి పెట్టాలని పూరి ఆలోచించినట్టుగా వినికిడి.
ఏదైతేనేమి పూరి-బాలయ్య సినిమాపై ఉన్న అంచనాల ఇలాంటి న్యూస్ తో రోజురోజుకి పెరిగిపోతున్నాయి.