బయోపిక్‌ల హవా నడుస్తోంది. సినీ తారలు, ఆటగాళ్లు, రాజకీయ నాయకుల కథలు తెరపైకొస్తున్నాయి. ఈ పరంపరలో మరో బయోపిక్‌కి రంగం సిద్ధం అవుతోంది. ఆ కథ మరెవరిదో కాదు.. ఉదయ్ కిరణ్‌ది. చిత్రం, నువ్వులేక నేను లేను, మనసంతా నువ్వే చిత్రాలతో ఒక్కసారిగా టాలీవుడ్ లోకి దూసుకొచ్చాడు ఉదయ్ కిరణ్. ఒకానొక సమయంలో తిరుగులేని స్టార్‌గా ఎదిగాడు. అయితే.. ఎంత త్వరగా ఎదిగాడో, అంతే త్వరగా తన పతనం ప్రారంభమైంది. సినిమాలు ఫ్లాప్ అవ్వడం, మరోవైపు అవకాశాలు దూరం అవ్వడంతో ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
సక్సెస్‌ని కాపాడుకోలేకపోతే ఏం జరుగుతుందనడానికి ఉదయ్ కిరణ్ జీవితమే ఓ గొప్ప ఉదాహరణ. అందుకే ఈ కథని తెరపైకి తీసుకురావాలనుకుంటున్నాడు. కథ సిద్ధమైంది. ఉదయ్ కిరణ్ పాత్రలో సందీప్‌కిషన్ కనిపిస్తాడని సమాచారం. ఈ సినిమాని వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై తానే నిర్మించనున్నాడు కూడా. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.