కరోనా హడావిడి లేకుంటే టాలీవుడ్ కి కొత్త సినిమాల సందడితో పాటూ, కొత్త జంటల సందడి కూడా ఎక్కువే ఉండేది. మన యంగ్ హీరోల ఇంట పెళ్లి బాజాలు మోగేవి. నితిన్, నిఖిల్ సిద్ధార్ధలు ఈ వేసవిలో పెళ్లి ముడితో ఒక్కటయ్యేందుకు మంచి ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, కరోనా వారి వారి పెళ్లి సందడికి ఆటంకమైంది. సందడిగా మోగాల్సిన పెళ్లి బాజాలకు లాక్డౌన్ పడింది. అనుకున్న సమయం కన్నా ఎక్కువ సమయాన్ని లాక్డౌన్ తినేస్తుండడంతో, ఇక నిఖిల్ ముందడుగు వేశాడు. అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లికి సిద్ధపడ్డాడు.
ఇక త్వరలోనే నితిన్ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్న తన పెళ్లికి మరో మంచి ముహూర్తాన్ని త్వరలోనే ఫిక్స్ చేసుకోనున్నాడట. తాజాగా రానా కూడా తన ఫియాన్సీని పరిచయం చేస్తూ పెళ్లి రేసులోకి వేగంగా దూసుకొచ్చేసిన సంగతి తెలిసిందే. డిశంబర్ లోనే రానా వివాహం జరిగే అవకాశాలున్నట్లు సురేష్ బాబు తెలిపారు. ఇదిలా ఉంటే, వీరితో పాటు, మెగా ఫ్యామిలీ కూడా పెళ్లి కబురు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెగా డాటర్ నిహారికకు ఈ ఏడాదిలోనే వివాహం చేయాలని మెగా బ్రదర్ నాగబాబు అనుకుంటున్నారట. అన్నీ కుదిరితే, డిశంబర్ కే నిహారిక పెళ్లి కూడా ఫిక్స్ అయ్యేలా సంకేతాలు అందుతున్నాయి.
ఆ తర్వాత మెగా రాకుమారుడు వరుణ్ బాబును కూడా ఓ ఇంటివాడ్ని చెయ్యాలని నాగబాబు అనుకుంటున్నారట. మరో వైపు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రబాస్ కూడా ఈ ఏడాదిలోనే పప్పన్నం పెట్టబోతున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. పరిస్థితులు చక్కబడి మునుపటిలా అన్నీ కుదిరితే, వీరి పెళ్ళిళ్ళన్నీ పండగలా టాలీవుడ్ కి సరికొత్త సందడిని తెచ్చి పెట్టేవి. కానీ, ఏం చేస్తాం.. కరోనా కాలం కాలు కదపనీయకుండా కట్టడి చేసేసింది. అయినా సరే, టాలీవుడ్ పెళ్లి బాజా మోగాల్సిందే.