టాలీవుడ్లో బోలెడన్ని పుకార్లు. ఇద్దరు కాస్తక్లోజ్ గా ఉన్నారంటే చాలు. చాలా పుకార్లు మొదలైపోతాయి. అలాంటిది.. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో కూడా వాళ్లు క్లోజ్ గా ఉంటూ.. కవ్వించుకుంటుంటే, ఇంకేమైనా ఉందా? టాలీవుడ్ లో అలా అందరి నోట్లో నానుతున్న ఓ జంట ఉంది. అందులో ఒకరు యాంకర్, మరొకరు కమెడియన్. ఇద్దరూ కలిసి టీవీ షోలు చేస్తుంటారు. ఆ షోలో ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటుంటారు. అంతేనా..? వారిద్దరి మధ్య ఏదో ఉందని హింట్ ఇస్తుంటారు. ఇద్దరి పెళ్లి గురించి చాలాసార్లు వార్తలొచ్చాయి. ఆ వార్తల్ని ఇద్దరూ గట్టిగా ఖండించారు కూడా. అయితే ఆ వార్తలు మాత్రం ఆగలేదు. ఇప్పుడు కూడా అంతే. వీరిద్దరూ కలిసి సహ జీవనం చేస్తున్నారన్నది టాలీవుడ్ టాక్.
హైదరాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్ లో ఆ యాంకర్ భామ ఓ ఫ్లాట్ కొనుగోలు చేసిందని, అప్పట్లి నుంచి.. ఆ కమెడియన్ కూడా తనతోనే ఉంటున్నాడని, ఇద్దరి మధ్య వ్వహారం చాలా దూరం వెళ్లిందని, ఇప్పుడు పెళ్లి చేసుకోవడమే మిగిలి ఉందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ఇది వరకు తమపై ఎలాంటి రూమర్లు వచ్చినా.. ఇద్దరూ ఒకే తాటిపై నిలబడి వాటిని ఖండించే వారు. ఇప్పుడు కూడా అలానే ఖండిస్తారా? లేదంటే.. అందరికీ షాక్ ఇచ్చేలా ఓ స్టేట్ మెంట్ ఇస్తారా? అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఎదురు చూడాల్సిందే.