ప్రముఖ పాటల రచయిత కులశేఖర్ మృతి

మరిన్ని వార్తలు

టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ గీత రచయిత కులశేఖర్ మంగళవారం ఉదయం కన్నుమూసారు. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో కొన్ని అనారోగ్య సమస్యలతో మరణించారు కుల శేఖర్. దీనితో పలువురు టాలీవుడ్ సినీప్రముఖులు కులశేఖర్ మృతికి సంతాపం తెలియజేస్తూ, నివాళులు అర్పిస్తున్నారు. కులశేఖర్ రాసిన చాలా పాటలు సూపర్ హిట్. ఈ మధ్య కాలంలో సరైన ఛాన్స్ రాక లైమ్ లైట్ లో లేరు కానీ, ఇంతకముందు ఆయన కలం నుంచి జాలు వారిన పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఈ తరం ప్రేక్షకులు కూడా కులశేఖర్ రాసిన పాటలు వింటున్నారు.

కులశేఖర్ జర్నలిస్ట్ గా కెరీయర్ మొదలుపెట్టి రాను రాను పాటలు రాయటం మొదలు పెట్టారు. తేజ సినిమాల్లో ఎక్కువగా కులశేఖర్ పాటలు రాశారు. చిత్రం, నువ్వు నేను, ఔనన్నా కాదన్నా, జయం, నిజం లాంటి సినిమాలతో పాటు, ఘర్షణ, భద్ర, సంతోషం, సైనికుడు, దిల్, సినిమాలకి కూడా పాటలు రాసారు. చాలా హిట్ సినిమాలకు పాటలు అందించారు కులశేఖర్. మంచి ఫామ్ లో కొనసాగారు. కానీ సడెన్ గా ఛాన్స్ లు తగ్గిపోవటంతో కొంచెం మెంటల్ గా డిస్ట్రబ్ అయ్యాడని, ఈ క్రమంలోనే దొంగతనాలు కూడా చేసాడని ప్రచారం జరుగుతోంది. దొంగతనం చేస్తూ చాలా సార్లు దొరికిపోయి జైలుకి వెళ్ళినట్లు తెలుస్తోంది.

జైలుకు వెళ్ళి పేరు పోగొట్టుకోవటంతో మళ్ళీ అవకాశాలు రాలేదు. చాలాసార్లు ప్రయత్నించి విసిగి పోయాడని సమాచారం. కొన్నాళ్లకిందట కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. స్టార్ రైటర్ గా పేరు తెచ్చుకున్న కులశేఖర్ ఇలా ఛాన్స్ దొరక్క, డబ్బుకి ఇబ్బందులు పడుతూ, చేయలేని పనులు చేస్తూ, మనసు విరిగిపోయి ఈ రోజు తనువు చాలించారు. ఇప్పుడు జాలి పడుతున్నారు ఇండస్ట్రీలో అదేదో బతికున్నప్పుడు ఆదుకుంటే ఇంకొన్నాళ్ళు బతికి ఉండేవారేమో.

కులశేఖర్ ఎక్కువగా ఆర్పీ పట్నాయక్ కంపొజిషన్ లో పాటలు రాసారు. పట్నాయక్ ప్రతిసినిమాలో కులశేఖర్ సాంగ్స్ రాసారు. అవన్నీ సూపర్ హిట్స్. చిత్రం సినిమాలో 'మావో... ఎల్లిపోతున్నాది'. ఫ్యామిలీ సర్కస్ లో 'నన్ను కొట్టకురో.. తిట్టకురో',  నువ్వు నేను లో 'ప్రియతమా తెలుసునా' 'నా గుండెల్లో నువ్వుండిపోవా' . వసంతంలో 'అమ్మో అమ్మాయేనా.. ఎల్లోరా శిల్పమా' నిజంలో 'అభిమన్యుడు కాడు వీడు.. అర్జునుడూ కాడు'. సంతోషంలో  'ధీందినక్‌తరి తక్‌ధిక్‌తోం' 'దేవుడే దిగివచ్చినా'. జయంలో 'రానురానంటూనే చిన్నదో' , అందమైన మనసులో ఇంత అలజడెందుకో' , 'ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ'. శ్రీను వాసంతి లక్ష్మిలో 'వానా వానా వానా.. నీలకాశంలోన'. దిల్ లో 'ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో' లాంటి పాటలు రాసారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS