ప్రపంచాన్ని తీవ్రంగా వణికిస్తోంది కరోనా. సామాజిక దూరం పాటించండి, విందులూ, వినోదాలూ పక్కన పెట్టండి అని ఎంతగా మొర పెట్టుకున్నా - ఎవరికీ పట్టడం లేదు. సినిమా వాళ్లకీ, పార్టీ కల్చర్ కీ అవినాభావ సంబంధం ఉంది. పార్టీలూ, వేడుకలూ లేకపోతే ఒక్కక్షణం కూడా తోచదు. అలానే సినిమావాళ్లంతా ఓ పార్టీ చేసుకున్నారు. అదే కలలకం రేపుతోంది.
ఇటీవల ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి ఓ పార్టీ ఇచ్చింది. ఆ పార్టీకి టాలీవుడ్‌కి చెందిన సినీ ప్రముఖులు కొంతమంది హాజరయ్యారు. ఆ లిస్టులో నాగచైతన్య, సమంత కూడా ఉన్నట్టు టాక్. తీరా చూస్తే.. ఇటీవల పరీక్షల్లో శిల్పాకి కరోనా పాజిటీవ్ గా నిర్దారణ అయ్యింది. దాంతో ఆ పార్టీకి వెళ్లినవాళ్లంతా షాక్‌కి గురయ్యారు. కరోనా టెస్టుల నిమిత్తం ల్యాబుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ పార్టీకి వెళ్లినవాళ్లంతా శిల్పాకి చాలా క్లోజ్ గా ఉన్నారు. కలసి భోజనం చేశారు. డ్రింక్స్ తీసుకున్నారు. అందుకే ఇంత టెన్షన్. అడుసు తొక్కనేల, కాళ్లు కడగనేల? అన్నట్టు ఆ పార్టీకి వెళ్లడం ఎందుకు? ఇప్పుడు గభరా పడడం ఎందుకు? ఇకనైనా పార్టీ కల్చర్‌కి సినిమావాళ్లు దూరంగా ఉంటే మంచిది.