టీఆర్‌పీలో టాప్ 5 నిలిచిన చిత్రాలివే!

మరిన్ని వార్తలు

2019 వెళ్లిపోతోంది. ఎన్నో విజ‌యాల్ని, ఇంకొన్ని ఎదురుదెబ్బ‌ల్ని మిగిల్చిన ఈ యేడాది - కొన్ని రికార్డుల్నీ అందించింది. సినిమా విడుద‌ల స‌మ‌యంలో క‌ల‌క్ష‌న్లు ఎంత కీల‌క‌మో, ఆ త‌ర‌వాత టీవీలో ప్ర‌ద‌ర్శించిన‌ప్పుడు టీఆర్‌పీ రేటింగులు కూడా అంతే కీల‌కంగా మారాయి. శాటిలైట్ హ‌క్కుల రూపంలో భారీ మొత్తాన్ని టీవీ ఛాన‌ళ్లు కేటాయిస్తున్న త‌రుణంలో.. టీఆర్‌పీ రేటింగులకు మ‌రింత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ యేడాది టీఆర్‌పీ ప‌రంగా రికార్డులు సృష్టించిన టాప్ 5 చిత్రాలేంటో చూస్తే...

 

మొద‌టి స్థానంలో ఎఫ్ 2 సినిమా నిలుస్తుంది. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ క‌ల‌సి న‌టించిన ఈ సినిమా సంక్రాంతికి విడుద‌లై సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. వినోదాత్మ‌క చిత్రం కాబ‌ట్టి, ఇద్ద‌రు హీరోలున్నారు కాబ‌ట్టి, అందునాసూప‌ర్ హిట్ సినిమా కాబ‌ట్టి, టీఆర్‌పీలోనూ త‌న హ‌వాచూపించింది. 17.2 రేటింగ్‌తో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది.

 

ఆ త‌ర‌వాత రేసులో ఉన్న సినిమా `ఇస్మార్ట్ శంక‌ర్‌`. పూరి - రామ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం మాస్‌కి తెగ ఎక్కేసింది. కుర్రాళ్లు తెగ చూశారు. టీవీ వీక్ష‌కుల‌లోనూ వాళ్లదే ఎక్కువ శాతం. అందుకే... ఇస్మార్ట్ శంక‌ర్ టీవీ రేటింగులు మార్మోగాయి. 16.6 శాతంతో రెండో స్థానంలో నిలిచింది.

 

మూడో స్థానం అనూహ్యంగా డ‌బ్బింగ్ సినిమా కాంచ‌న 3కి ద‌క్కింది. తెలుగులో ఏమాత్రం ఆడ‌ని సినిమా ఇది. కానీ టీవీ వీక్షకులు మాత్రం ఈ సినిమాకి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. 13 రేటింగులో మూడో స్థానంలో నిల‌బెట్టారు.

 

4వ స్థానంలో నిలిచిన సినిమా `రాక్ష‌సుడు`. బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌. థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో సాగిన ఈ చిత్రానికి బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లిత‌మే వ‌చ్చింది. 10.1 రేటింగుతో మంచి టీఆర్‌పీ ద‌క్కించుకుంది.

 

ఈ యేడాది సూప‌ర్ హిట్ చిత్రాల‌లో మ‌హ‌ర్షి ఒక‌టి. మ‌హేష్ న‌టించిన మ‌రో వంద కోట్ల సినిమా. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, ష్రెండ్ షిప్‌, మాస్ ఇలా అన్నీ కుదిరాయి. మ‌హేష్‌కి మ‌హిళా అభిమానుల స‌పోర్ట్ చాలా ఉంది. అందుకే టీవీలో వ‌చ్చిన‌ప్పుడు కూడా ఈ సినిమాని వ‌ద‌ల్లేదు. 9.2 రేటింగుతో 5వ స్థానం ఇచ్చారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS