కాజల్ అగర్వాల్ : నెంబర్ వన్ హీరోయిన్‌గా చెలామణీ అయ్యింది చందమామ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా కానీ ఐటెం సాంగ్‌కి మాత్రం నో అని గతంలో చాలా సార్లు చెప్పింది ఈ ముద్దుగుమ్మ. కానీ వరుసగా ఈ ఏడాది కాజల్ హీరోయిన్‌గా నటించిన చేసిన రెండు భారీ సినిమాలు ఆశించినంత విజయాన్ని అందించలేకపోయాయి. సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో భారీ అంచనాల నడుమ వచ్చిన 'బ్రహ్మూెత్సవం' సినిమా రిజల్ట్ బాగా నిరాశ పరిచింది కాజల్‌ని. అలాగే పవన్‌తో తొలిసారిగా జతకట్టింది 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో. రాజకుమారి పాత్రలో చాలా అందంగా కనిపించింది ఈ సినిమాలో కాజల్ అగర్వాల్. కానీ అనుకోని కారణాలతో ఈ సినిమా కూడా ఆమెను నిరాశకు గురి చేసింది. ఆ టైంలో అదృష్టవశాత్తూ ఆమెకు 'జనతా గ్యారేజ్' రూపంలో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చింది ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ 'నేను పక్కా లోకల్' అంటూ చిందేసింది.ఈ స్పెషల్ సాంగ్ కోసం కాజల్ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంది కూడా. అంతేకాదు ఈ స్పెషల్ సాంగ్ దెబ్బతో ఏకంగా మెగాస్టార్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించేసుకుంది ముద్దుగుమ్మ కాజల్. కెరీర్‌లో చేసిన తొలి ఐటెం సాంగ్ ది బెస్ట్ టర్నింగ్ పాయింట్ అయ్యింది కాజల్‌కి.
అంజలి: పదహారణాల తెలుగమ్మాయి అంజలి. ఏ పాత్రకైనా సూటయిపోయే కటౌట్ అమ్మడిది. కానీ లక్ కలిసి రాలేదు. తెలుగులో చెప్పుకోదగ్గ విజయాలేమీ లేవు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో సీతగా మెప్పించింది. సినిమా మంచి విజయం సాధిఆంచింది. అలాగే 'గీతాంజలి' సినిమాతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నటించింది. హారర్ జోన్‌లో వచ్చిన ఈ సినిమా అంజలికి మంచి పేరే తీసుకొచ్చింది. అలాగే నందమూరి నటసింహం బాలయ్యతో కలిసి 'డిక్టేటర్' సినిమాలో నటించింది. ఈ దెబ్బతో అంజలి గట్టెక్కేసినట్లే. భారీ ప్రాజెక్టులు వచ్చి ఆమె ముందు వాలతాయి అని ఆశించారంతా. కానీ ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోకపోవడంతో మళ్లీ అంజలి రేస్‌లో వెనకబడిపోయింది. అదే టైంలో స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చింది. మొదట సూర్య సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించింది. ఈ ఏడాది బన్నీతో 'సరైనోడు' సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. 'బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టరే అంటూ ఆ సాంగ్‌లో అదరగొట్టేసింది. ఆ సాంగ్ సినిమాకే స్పెషల్ గ్లామర్ తెచ్చింది.
లక్ష్మీరాయ్: 'కాంచనమాల 'కేబుల్ టీవీ' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ లక్ష్మీరాయ్. హీరోయిన్‌గా ఒకటి అరా, సినిమాలు చేసినా, 'కాంచన' సినిమాతో తమిళంలో బెస్ట్ హీరోయిన్ అయ్యింది. మొదట్నుంచీ ఈ భామ హాట్ అప్పీల్‌కి అస్సలు మొహమాటపడదు. అందుకే ఐటెం సాంగ్స్‌కి కూడా పెద్దగా ఇబ్బంది పడకుండా వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకుని క్యాష్ చేసుకుంది. చాలా ఐటెం సాంగ్స్‌లో నటించినా కానీ రాయ్ లక్ష్మీకి 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమాలో చేసిన 'తోబా తోబా సాంగ్ చాలా స్పెషల్. పవన్‌తో ఆ పాటలో ఈ ముద్దుగుమ్మ వేసిన స్టెప్పులకి ధియేటర్లు అదరిపోయాయ్. కొంచెం బొద్దుగా ఉన్నా కానీ ఈ సాంగ్‌లో మాత్రం రాయ్ లక్ష్మీకి మంచి మార్కులు పడ్డాయి. ఇక్కడితో ఆగిపోలేదు ఆమె ఐటెం జర్నీ. ఏకంగా చిరంజీవి సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ దక్కించుకుంది. 'ఖైదీ నెం 150' సినిమాలో రాయ్ లక్ష్మీ ఐటెం సాంగ్ అదిరిపోనుంది.
తమన్నా: ఐటెం సాంగ్స్ చేసేవాళ్లు సెపరేట్ కాదు. స్టార్ హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్స్‌లో నటించొచ్చు అని నిరూపించింది మిల్కీ బ్యూటీ తమన్నా. తొలి సారిగా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా 'అల్లుడు శీను'తో మిల్కీ బ్యూటీ ఐటెం జర్నీ స్టార్ట్ చేసింది. ఈ సినిమాలో తమన్నా ఐటెం సాంగ్‌తో దుమ్ము రేపింది. రెండో సారి కూడా తెలుగులో బెల్లంకొండతోనే 'స్పీడున్నోడు' సినిమా కోసం ఐటెం సాంగ్‌లో నటించింది తమన్నా. తెలుగులోనే కాదు కన్నడలో కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ గౌడ హీరోగా తెరకెక్కిన 'జాగ్వార్' సినిమాలో కూడా ఐటెం సాంగ్‌లో మెరిసింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇకపై కూడా ఐటెం సాంగ్‌కి రెడీనే అంటోంది తమ్మూ బ్యూటీ.
వీరే కాకుండా ఈ ఏడాది అనసూయ, ముమైత్ ఖాన్, శ్రద్దాదాస్ తదితరులు ఐటెం సాంగ్స్‌లో మెరిశారు. ఏది ఏమైనా ఐటెం సాంగ్‌లో నటించడం చిన్నతనమేమీ కాదు. అలా నటించడం వల్ల మరింత స్పెషల్‌గా పేరు తెచ్చుకోవచ్చు అని నిరూపించారు స్టార్ హీరోయిన్లు. వీరిని ఆదర్శంగా తీసుకుని చాలా మంది ముద్దుగుమ్మలు ఐటెం సాంగ్ అఫర్స్ కోసం ఎదురు చూస్తున్నారంటే టాలీవుడ్‌కి ఐటెం బాంబ్ ఇచ్చిన ఎఫెక్ట్ ఏ పాటిదో గమనించాలి మరి.