ఏదైనా సినిమా హిట్ అయ్యిందంటే ఇండస్ట్రీకి ఆ కళే వేరు. వచ్చిన ప్రతీ సినిమా హిట్టవ్వాలనే ఆశిస్తుంది ఇండస్ట్రీ. అయితే ప్రతీ పెద్ద సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటాం. కానీ కొన్ని సినిమాలకు మాత్రమే హిట్ కళలు కనిపిస్తాయి. అనుకోకుండా కొన్ని సినిమాలు అనూహ్యంగా భారీ హిట్స్ సాధిస్తాయి. ఈ సంవత్సరం చిన్న, పెద్దా సినిమాలు చాలా వరకూ హిట్ టాక్‌ని సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాది రామ్, కీర్తి సురేష్ నటించిన 'నేను శైలజ..' సినిమాతో హిట్ బోణీ కొట్టింది. దాంతో వరుస సినిమాలు తమ హిట్ ఖాతాలు తెరిచాయి. వాటిలో ఏమేమి హిట్ టాక్స్ సొంతం చేసుకున్నాయో తెలుసుకుందాం.
సరైనోడు -జనతా గ్యారేజ్ : ఈ సినిమాలు రెండూ ఏవరేజ్ టాక్‌తో స్టార్ట్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్స్‌ని సొంతం చేసుకున్నాయి. వీటిలో 'సరైనోడు' సినిమా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా మాస్ జనాన్ని ఆకట్టుకుంది. అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. 'జనతా గ్యారేజ్' సినిమా భారీ అంచనాల నడుమ విడుదలయ్యింది. క్లాస్ టచ్ ఉన్న మాస్ సినిమాగా సక్సెస్ అయ్యింది. ఇయర్ స్టార్టింగ్‌లోనే విడుదలయిన మరో క్లాస్ సినిమా 'నాన్నకు ప్రేమతో'. ఈ సినిమా పక్కా క్లాస్ మూవీ అయినా కానీ ఎన్టీఆర్‌కి మంచి హిట్ ఇచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గెటప్, సినిమా లుక్ అంతా చాలా క్లాస్‌గా ఉన్నప్పటికీ మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ స్టైలీ పర్‌ఫామెన్స్‌తో పాటు, సూపర్ డాన్స్‌లకు కూడా వేదికైంది. స్టైలీ లుక్స్‌తో అదరగొట్టే డాన్సులతో క్లాస్ టచ్ ఉన్న సినిమా అయినా కానీ మాస్ ఆడియన్స్‌ని బాగా ఎట్రాక్ట్ చేశాడు ఎన్టీఆర్. ఇదే సక్సెస్‌ని 'జనతా గ్యారేజ్'కీ కంటిన్యూ చేశాడు. కొంచెం క్లాస్ టచ్‌కి, మరికొంచెం మాస్ అప్పీల్‌ని జాయింట్ చేసి మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుని ఈ ఏడాదిలో రెండు హిట్‌లు తన ఖాతాలో వేసుకున్నాడు యంగ్ టైగర్.
సోగ్గాడే చిన్న నాయనా : నాగార్జున కెరీర్‌లో 50 కోట్ల సినిమాగా నిలిచింది ఈ సినిమా. అస్సలు అంచనాలే లేకుండా అనూహ్యంగా మంచి హిట్ అందుకుంది ఈ సినిమా. ఎవ్వరూ ఊహించని సబ్జెక్ట్ ఇది. సంక్రాంతికి నిజమైన ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించింది. ఈ సబ్జెక్ట్ నచ్చే నాగార్జున కొత్త డైరెక్టర్ అయిన కళ్యాణ్ కృష్ణ చేతిలో ఈ సినిమాను పెట్టాడు. నాగార్జున ఊహించిన విధంగానే సంక్రాంతికి కలర్ ఫుల్ హిట్‌ని సొంతం చేసుకుంది నాగార్జున ద్విపాత్రాభినయం అందర్నీ ఆకట్టుకుంది ఈ సినిమాలో. '
పెళ్లిచూపులు, అ,ఆ.. : స్టార్ డైరెక్టర్లు ఎంతో మంది తన కోసం ఎదురు చూస్తున్నా త్రివిక్రమ్ యంగ్ హీరో నితిన్‌కి ఛాన్సిచ్చాడు 'అ,ఆ..' సినిమాతో. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకి భారీ సక్సెస్‌ని తెచ్చి పెట్టింది. ఇకపోతే చిన్న సినిమాగా విడుదలయ్యింది 'పెళ్లి చూపులు'. ఇండస్ట్రీకి షాకింగ్ రిజల్ట్‌ని ఇచ్చింది ఈ సినిమా. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లతో పాటు డైరెక్టర్‌కీ, ప్రొడ్యూసర్‌కీ, మిగతా అందరు టెక్నీషియన్స్‌కీ మంచి పేరు వచ్చింది ఈ సినిమాతో. అంతగా ప్రముఖులతో ప్రశంసలు అందుకుంది ఈ సినిమా. ఇప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడకుకుంటున్నారంటేనే ఈ సినిమా తెచ్చిన రిజల్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అలాగే నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీర ప్రేమగాధ', 'జెంటిల్‌మెన్', మజ్ను' సినిమాలు కూడా ఈ ఏడాది మంచి విజయాలు అందుకున్నాయి. అలాగే మరో యంగ్ హీరో నాగచైతన్య ఈ ఏడాది వరుస హిట్లతో మన ముందుకొచ్చాడు. 'సాహసం శ్వాసగా సాగిపో', 'ప్రేమమ్' సినిమాలు చైతూ లిస్టులో హిట్స్‌గా నిలిచాయి ఈ సంవత్సరం. నిఖిల్ హీరోగా వచ్చిన మరో చిన్న సినిమా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'. కరెన్సీ సంక్షోభంలో కూడా తట్టుకుని నిలబడి యావరేజ్ స్థాయి నుండి నిఖిల్ స్థాయికి హిట్ సినిమాగా నిలిచింది.
బిచ్చగాడు : ఈ ఏడాది సెన్సేషన్ సాధించిన మరో మూవీ 'బిచ్చగాడు' గురించి మాట్లాడుకోవల్సిందే. ఎందుకంటే డబ్బింగ్ సినిమాగా వచ్చి, ఎవ్వరూ ఊహించని విధంగా సక్సెస్ అందుకుంది. దర్శక నిర్మాతలకు ఊహించని స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఇది. డబ్బింగ్ సినిమా అయినా క్లాస్, మాస్ డిఫరెన్స్ లేకుండా మంచి సినిమాగా నిలిచింది.
'ఎక్స్‌ప్రెస్ రాజా', ఊపిరి', బాబు బంగారం', సుప్రీమ్, క్షణం', కళ్యాణ వైభోగమే', 'ఈడో రకం - ఆడోరకం' శ్రీరస్తు శుభమస్తు, జ్యో అచ్చుతానంద' తదితర సినమాలు 2016లో విడుదలై మంచి విజయాల్ని నమెదు చేశాయి. ఏడాది చివర్లో భారీ అంచనాల నడుమ విడుదలయ్యింది రామ్ చరణ్ 'ధృవ'. అంచనాలకు తగ్గట్టుగానే భారీ విజయంతో ఈ ఏడాదికి టాటా చెప్పింది 'ధృవ' సినిమా.