చెన్నయ్‌లో శ్రీరెడ్డికి ఎంత కష్టమొచ్చిందో..?

మరిన్ని వార్తలు

ఓ తమిళ హీరో, శ్రీరెడ్డిని వేధింపులకు గురిచేస్తున్నాడట. ఆ హీరో కారణంగా తాను బతకలేని స్థితి ఏర్పడిందంటూ వాపోయింది శ్రీరెడ్డి సోషల్‌ మీడియాలో. ఎవరా హీరో అనేది మాత్రం చెప్పలేదు. ఆ హీరో తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడేనట. శ్రీరెడ్డి, తెలుగుతోపాటు తమిళ సినీ ప్రముఖులపైనా ఆరోపణలు చేసింది. లారెన్స్‌, విశాల్‌ తదితరులపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణల్ని ఎవరూ మర్చిపోలేదు. అయితే లారెన్స్‌, శ్రీరెడ్డికి ఓ సినిమాలో నటించడానికి ఛాన్స్‌ ఇచ్చాడట. ఛాన్స్‌ వచ్చిందని శ్రీరెడ్డి చెప్పడమేగానీ, లారెన్స్‌ ఎక్కడా ప్రకటించలేదు.

విశాల్‌ గురించి శ్రీరెడ్డి ఆరోపించిందా.? లారెన్స్‌ గురించి ఆరోపించిందా? అనేది తెలియరావడంలేదు. లారెన్స్‌ తనను గతంలో వాడుకున్నాడని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. వాటిని లారెన్స్‌ తిప్పికొట్టాడు. అవకాశాల పేరుతో ఎవర్నీ తాను వాడుకోనని చెప్పిన లారెన్స్‌, కావాలంటే శ్రీరెడ్డి తనతోపాటు ఎవర్నయినా పెద్దవారిని తీసుకొస్తే.. స్క్రీన్‌ టెస్ట్‌ చేసి, ఆమె టాలెంట్‌ చూసి, అవకాశమివ్వడానికి తాను రెడీ అని ప్రకటించాడు. ఆ తర్వాత శ్రీరెడ్డి, లారెన్స్‌ దగ్గరకు స్క్రీన్‌ టెస్ట్‌ కోసం వెళ్ళాననీ, లారెన్స్‌ ఎంత మంచివాడో తనకు అర్థమయ్యిందనీ, ఛాన్స్‌ కూడా ఇచ్చాడనీ చెప్పింది.

మళ్ళీ ఇప్పుడు శ్రీరెడ్డి ఇలాంటి ఆరోపణలు చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. బతకలేని పరిస్థితి వచ్చిందంటూ శ్రీరెడ్డి చెప్పడంతో ఇంకో పబ్లిసిటీ స్టంట్‌కి ఆమె తెరలేపిందా? అనే అనుమానాలు అయితే పెరుగుతున్నాయి. చెన్నయ్‌లో కూడా శ్రీరెడ్డిని పట్టించుకునేవారెవరూ లేకపోవడంతోనే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS