నీటి అడుగున ఆసనంలో కూర్చొని ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎవరనుకుంటున్నారా? 'సూర్య వెర్సస్ సూర్య' సినిమాలో యంగ్ హీరో నిఖిల్‌తో జత కట్టిన బ్యూటీ త్రిధా చౌదరి. తాజాగా 'మనసుకు నచ్చింది' సినిమాలో నటిస్తోంది మంజుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఇది. సినిమాల సంగతి పక్కన పెడితే, అమ్మడికి ఫిజిక్‌పై కాన్‌సన్‌ట్రేషన్ కొంచెం ఎక్కువే. అందుకే ఎప్పుడూ ఫిజిక్‌ని ఇన్ షేప్‌లో ఉంచేందుకు తాపత్రయ పడుతూ ఉంటుంది. యోగాలు, ఆసనాలు వేయడంలో ఈ ముద్దుగుమ్మ ధిట్ట. ఇదిగో చూశారుగా, నీటి అడుగున ఆసనం ఎంత పర్‌ఫెక్ట్‌గా వేసిందో. అదే త్రిధా చౌదరి. ఒక్క దెబ్బకే రెండు పిట్టలు. ఓ పక్క కావాల్సినంత గ్లామర్ మరో పక్క యోగా థ్రిల్. రెండూ వెరసి అమ్మడి ఫోటో భలే కిక్కిస్తుందిలే!