వెంకీతో అనుకుంటే... ర‌వితేజ‌తో సెట్ అయ్యింది

By Gowthami - February 26, 2020 - 16:30 PM IST

మరిన్ని వార్తలు

సినిమా చూపిస్త మావా, నేను లోక‌ల్, హ‌లో గురు ప్రేమ కోస‌మే... సినిమాల‌తో మంచి విజ‌యాల్ని అందించాడు త్రినాథ‌రావు న‌క్కిన‌. ఆ వెంట‌నే వెంక‌టేష్ తో ఓ సినిమా తీస్తున్నాడ‌న్న వార్త‌లొచ్చాయి. ఆ స్క్రిప్టుపై కొంత‌కాలం వర్క్ చేశాడు త్రినాథ‌రావు. మ‌రి అంత‌లో ఏమైందో.. ఆ ప్రాజెక్టు వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. ఆ క‌థ ప‌ట్టుకుని చాలా మంది ద‌గ్గ‌ర‌కు తిరిగాడు. కానీ లాభం లేక‌పోయింది. ఇంత‌కాలానికి ఓ హీరో తో `ఎస్` అనిపించుకున్నాడాయ‌న‌. త‌నే.. ర‌వితేజ‌. అవును... ర‌వితేజ‌తో త్రినాథ‌రావు సినిమా ఖ‌రారైంది.

 

ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించ‌నుంది. ఇప్ప‌టికే క‌థా చ‌ర్చ‌లు పూర్తయ్యాయి. అటు ర‌వితేజ నుంచి కూడా గ్రీన్ సిగ్న‌ల్ అందేసింది. ఇక లాంఛ‌నంగా ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి. ప్ర‌స్తుతం క్రాక్ సినిమాతో బిజీగా ఉన్నాడు ర‌వితేజ‌. ఆ వెంటనే ర‌మేష్ వ‌ర్మ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. మ‌రి.. త్రినాథ‌రావు క‌థ‌కు స్లాట్ ఎక్క‌డుందో తెలియాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS