సమంత పేరు మార్మోగిపోవడానికి కారణం ఆమె నటించిన 'ఏ మాయ చేశావె' సినిమా. ఈ సినిమాతోనే సమంత తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సినిమా తమిళ వెర్షన్‌లో త్రిష నటించిన సంగతి తెలిసిందే. త్రిష పోషించిన పాత్రతోనే ఎంట్రీ ఇచ్చింది సమంత. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ త్రిష నటించిన పాత్రలో సమంత నటిస్తోంది. అదేనండీ, '96' రీమేక్. 'జాను' టైటిల్‌తో తెలుగులో రీమేక్ అవుతోంది. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్‌లో త్రిషకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. విమర్శకుల ప్రశంసలు అందించింది. మరి, సమంతకూ ఆ ప్రశంసలు దక్కుతాయా.? అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
సమంత, శర్వానంద్ జంటగా ఈ సినిమా తెలుగులోకి రీమేక్ అవుతోంది. ఒరిజినల్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ఈ సినిమాని తెలుగులో రూపొందిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన టీజర్‌లో సమంత ఆల్రెడీ మార్కులు కొట్టేసింది. అయితే, సినిమా విడుదలయ్యాకా ఫైనల్ టాక్ తెలుస్తుంది. అయినా సమంత ఏది పట్టినా బంగారమే అవుతుంది. 'రంగస్థలం' సినిమా ముందు వరకూ సమంత వేరు. ఆ తర్వాత వేరు. ఆ తర్వాత నుండీ సమంత పూర్తిగా మారిపోయింది. తనలోని కొత్త నటికి ప్రాణం పోసింది. ఏ పాత్రకైనా ప్రాణం పెట్టేస్తోంది. గత ఏడాది సమంత ఖాతాలో 'మజిలీ', 'ఓ బేబీ' సూపర్ హిట్స్ ఉన్నాయి. ఈ ఏడాది 'జాను'తో హిట్ దక్కించుకుంటుందేమో చూడాలిక.