త్రిష కోరిక తీరిపోనుందేమో.!

By iQlikMovies - August 17, 2018 - 12:09 PM IST

మరిన్ని వార్తలు

దాదాపు స్టార్‌ హీరోలందరి సరసన నటించిన ముద్దుగుమ్మ త్రిషకు కెరీర్‌లో ఒకే ఒక కోరిక మిగిలిపోయింది. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడమే. అయితే ఆ కోరిక కూడా త్రిషకు ఇప్పుడు తీరిపోనుందంటే అవునంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష కథానాయిక అంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.

అయితే అనూహ్యంగా సిమ్రాన్‌ పేరును ఈ సినిమా కోసం ఖరారు చేశారు. అయితే సిమ్రాన్‌తో పాటు, మరో హీరోయిన్‌ పాత్రకూ ఈ సినిమాలో చోటుందట. ఆ ప్లేస్‌నే త్రిషకు కేటాయించినట్లు తాజాగా అందుతోన్న సమాచారమ్‌. ఈ విషయంపై అఫీషియల్‌ క్లారిటీ ఇంకా రాలేదు. కానీ ఆల్‌మోస్ట్‌ త్రిష పేరు ఈ సినిమాకి ఖరారైనట్లేనని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ ద్వారా అందుతోన్న సమాచారమ్‌. ప్రస్తుతం త్రిష తమిళంలో ఫుల్‌ బిజీగా గడుపుతోంది. త్రిష నటిస్తున్న సినిమాలన్నీ దాదాపు హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీసే కావడం విశేషం.

ఈ తరుణంలో త్రిష కోరిక ఇంత సులువుగా నెరవేరుతుందని అస్సలు ఊహించలేదట. ఏమో అధికారిక ప్రకటన వస్తే కానీ, ఈ విషయంలో క్లారిటీ లేదు. మరోవైపు ఈ సినిమాలో సిమ్రాన్‌ పాత్ర నెగిటివ్‌ షేడ్స్‌తో కూడుకొన్నదనీ తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే, బహుశా త్రిషది మెయిన్‌ హీరోయిన్‌ పాత్రే కావచ్చు. ఈ సినిమాకి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే డెహ్రాడూన్‌లో తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నెక్స్ట్‌ షెడ్యూల్‌ కోసం భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS