కండలు పెంచేస్తోన్న త్రిష!

మరిన్ని వార్తలు

నాజూకు అందాల బ్యూటీ త్రిష ఏంటి ఇలా కండలు పెంచేసిందేంటి అనుకుంటున్నారా? అవును ఈ ఫోటో లేటెస్టుగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది ముద్దుగుమ్మ త్రిష. నెట్‌లో హల్‌ చల్‌ చేస్తోందిప్పుడు ఈ ఫోటో. కండలు, కసరత్తుల మాటున త్రిష గ్లామర్‌ అదరిపోతోంది. ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు త్రిష కండలు తీరిన గ్లామర్‌కి. అయితే ఎందుకిలా త్రిష కసరత్తులు చేస్తోంది.. అంటే ఓ యాక్షన్‌ మూవీ కోసం అని టాక్‌ వినిపిస్తోంది. కోలీవుడ్‌లో త్రిష హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌తో బిజీగా ఉంది ప్రస్తుతం. అలా ఓ యాక్షన్‌ మూవీ కోసమే ఈ ముద్దుగుమ్మ తన అందాల్ని మరింత పదును పెడుతోందని తెలియ వస్తోంది. అయితే చక్కనమ్మలు ఏం చేసినా అందమే కదా. అలా కండలు పెంచేసినా కానీ త్రిష ముద్దుగానే కనిపిస్తోంది. అందాలతో మరిపిస్తోంది. ఆ సినిమా కోసమే త్రిష కిక్‌ బాక్సింగ్‌, రన్నింగ్‌ వంటి కసరత్తులు చేస్తోందట. దాంతో ఇదిగో తన శరీర ధారుడ్యం ఈ విధంగా ఉందంటూ లేటెస్ట్‌ పిక్‌ని అభిమానులతో షేర్‌ చేసుకుంది త్రిష. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో త్రిష గ్లామరస్‌ పాత్రల కన్నా, హుందా అయిన పాత్రలు, హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌కే ఫిక్స్‌ అయిపోయింది. తెలుగులో కన్నా, త్రిషకు తమిళంలో ఎక్కువ ఫాలోయింగ్‌ ఉంది ప్రస్తుతం. ఆ క్రేజ్‌తోనే వయసుకు తగ్గట్లుగా కథలను ఎంచుకుంటూ ఏమాత్రం తొందర పడకుండా ఆచి తూచి వ్యవహరిస్తోంది. కెరీర్‌ని మరింత పటిష్టంగా, అందంగా మలచుకుంటోంది. ఈ విషయంలో త్రిష ఆటిట్యూడ్‌ని మెచ్చుకుని తీరాల్సిందే!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS